Tantra Trailer: వకీల్ సాబ్ అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం భయభ్రాంతులను చేస్తోంది.
‘రామాయణ యుద్ధంలో రావణుడి కొడుకు ఇంద్రజిత్తు, నికుంబళ దేవికి పూజ చేస్తున్నపుడు లక్ష్మణుడు ఆ పూజని పూర్తి చేయనివ్వకుండా వానర సైన్యంతో దాడి చేస్తాడు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నికుంబళ దేవి ఒక క్షుద్రదేవత. ఇంద్రజిత్తు తలపెట్టింది క్షుద్రపూజ’ అంటూ లక్ష్మణ్ మీసాల తాంత్రిక పూజల గురించే చెప్పే టెర్రిఫిక్ ఎపిసోడ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.ట్రైలర్ బినింగ్ లో కేవలం అనన్యకు మాత్రమే జుట్టు విరబూసుకుని బాత్ రూమ్ లో ఓ పాప కనిపించడం, తర్వాత వచ్చే తాంత్రిక విధానాల సీక్వెన్స్ లు ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అనన్య, ధనుష్ మధ్య వున్న ప్రేమకథని కూడా చాలా నేచురల్ గా ప్రజెంట్ చేశారు. అనన్య, ధనుష్ పెర్ఫార్మెన్స్ బ్రిలియంట్ గా వుంది. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ శవం పైకి లేచిన మూమెంట్ అయితే థియేటర్ లో ప్యాంట్ తడిచిపోవడం ఖాయమని చెప్పొచ్చు. సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధృవన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఇక థియేటర్ లో కూడా ఇదే ఆసక్తి.. సినిమా కథలో ఉంటే కచ్చితంగా ఒక మంచి హర్రర్ సినిమాగా మారుతోందని చెప్పొచ్చు. మరి ఈ సినిమ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.