ఇప్పటిదాకా కనీసం 6 నెలల అనుభవం ఉన్నోళ్లే పీఎఫ్ అకౌంట్లోని డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై అంతకన్నా తక్కువ సర్వీసు ఉన్నోళ్లు కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే చాలా మంది ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే 1 నుంచి 6 నెలల లోపు ఉద్యోగం మానేసేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వాళ్లు వేరే […]
ఇస్త్రీ చేసేటప్పుడు దుస్తుల మీద లైట్‌గా నీళ్లు చల్లి తడుపుతారు. తద్వారా బట్టలను మెత్తగా, నీట్‌గా, ఐరన్ చేయటానికి అనుకూలంగా మడుచుకుంటారు. ఇది దాదాపు అందరూ చేసేదే. కానీ ఓ వ్యక్తి దీనికి కాస్త క్రియేటివిటీని జోడించాడు. అయితే అతను చేసిన ఈ పని చూస్తే మనకు నవ్వుతోపాటు పట్టరాని కోపం కూడా వస్తుంది. శుభ్రంగా ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయరా నాయనా అని ఇస్తే ఇలా ఎంగిలి నీళ్లతో గబ్బు గబ్బు చేయటాన్ని అస్సలు సహించలేం. […]
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఎలా పోరాడబోతున్నానో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. ‘నేను బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐ వంటి పార్టీలతో జైతెలంగాణ అనిపించలేదా. అదీ కేసీఆర్ అంటే. నేను దేశం కోసం పోరాటం మొదలుపెట్టబోతున్నా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అందరూ నాతో వస్తారు. బీజేపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయను. వాళ్ల తప్పులు వాళ్లే పెంచుకునే దాక చూస్తా. వాళ్లకు ఇంకా అహంకారం పెరగాలి. నేను ఎవరికీ భయపడను. ఒకరో […]
ఇవాళ మీడియాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘మేకిన్ ఇండియా పథకం అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహులు అంటున్నారు. పాకిస్థాన్ మనకు అసలు సమస్యే కాదు. అది స్మాల్ ప్రాబ్లం. చైనాతోనే మనకు ముప్పు పొంచి ఉంది. స్విస్ బ్యాంకులోని డబ్బులను వెనక్కి తెస్తామన్నారు. కానీ అక్కడ డిపాజిట్లు డబుల్ అయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. ఢిల్లీలో మాటలు చెప్పే ఇంజన్ వద్దు. పనిచేసే ఇంజన్ […]
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ మీటింగులో.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ సాధించింది ఏమీలేదని విమర్శించారు. తాను అడిగిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని తప్పుపట్టారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు వాళ్లు చేసిందేమీ లేదని, వాళ్ల దగ్గర సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ 80కి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. […]
దీర్ఘకాలికంగా బీపీ, షుగర్లతో బాధపడేవాళ్లు నెలకోసారో, రెండు మూడు నెలలకోసారో పరీక్షలు చేయించుకుంటే ఫలితాలు సరిగ్గా రావు. డైలీ టెస్టులు చేయించుకుంటే డైట్‌ని పక్కాగా ఫాలో అవ్వొచ్చు. తద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చాలా మంది.. రక్త పరీక్షలు చేయించుకోవాలంటే భయపడతారు. సూదిని చూసి వణికిపోతారు. ఇలాంటివారి కోసం (నీడిల్ ఫోబియా ఉన్నోళ్ల కోసం) కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు “ఏవ”(EYVA). హైదరాబాద్‌కి చెందిన బ్లూసెమీ అనే సంస్థ ఈ డివైజ్‌ని రూపొందించింది. […]
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్లైన్ […]
చారిత్రకంగా చూస్తే శ్రీలంక పేరు ప్రస్తావన రామాయణం, మహాభారతంలలోనూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశం పరిస్థితికి కారణం ఎవరని పరిశీలిస్తే మహాభారతంలో పేర్కొన్న దుష్ట చతుష్టయం లాంటి ‘ఆ నలుగురు’ కనిపిస్తారు. ఏపీలో నిన్నే ముగిసిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో కూడా దుష్టచతుష్టయం అనే అంశంపై నేతలు విరివిగా ప్రసంగించటం గమనార్హం. అదే సమయంలో అటు శ్రీలంక ప్రజలు తమ దేశ అధ్యక్షుడి నివాసాన్ని ఆక్రమించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అప్పటికే పరారయ్యారు. పాలకుడంటే ప్రజలను […]
ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి పలు అనుమానాలు, భయాలు ఉంటాయి. శాలరీ ఎక్కువ అడిగితే మా దగ్గర ‘అంతలేదు’ అంటారేమోనని, ‘ఫోన్ చేస్తాం’ అని చెప్పి పంపిస్తారేమోనని అనుకుంటారు. అసలు అవకాశమే ఇవ్వరేమోనని ఆందోళన చెందుతారు. ఆల్రెడీ వేరే చోట ఉద్యోగం చేసేవాళ్లు మరో సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీని ప్రస్తుత వేతనం కన్నా ఐదు వేలో, పది వేలో పెంచి చెప్పటానికి జంకరు. ఎందుకంటే కొత్తోళ్లు ఛాన్స్ ఇవ్వకపోయినా చేతిలో ఉద్యోగం ఉంది […]
టాటా వాహనాలు మరింత ప్రియం టాటా వాహనాలు మరింత ప్రియమయ్యాయి. ప్రయాణికుల వాహనాల రేట్లను టాటా మోటర్స్ పెంచింది. దీంతో ఈ శ్రేణిలోని వాహనాలను ఇకపై సగటున 0.55 శాతం అధిక ధరలకు కొనాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని టాటా మోటర్స్ స్పష్టం చేసింది. తయారీ ఖర్చులను కాస్త తగ్గించుకునేందుకే రేట్లు పెంచామని వివరణ ఇచ్చింది. రోజురోజుకీ పెరుగుతున్న ఇన్పుట్ వ్యయం భారంగా మారుతోందని వెల్లడించింది. స్టాఫ్ భారాన్ని తగ్గించుకుంటున్న ఓలా ఇండియన్ […]