ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా […]
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో వరద ప్రవాహం ‘ప్రమాద’కరంగా పెరుగుతోంది. ఒక్కో అడుగూ పెరుగుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 13.3 అడుగుల వద్దకు చేరింది. దీంతో మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు మొదటి […]
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపటి వరకు పలు రైళ్లను రద్దు చేసింది. క్యాన్సిల్ అయిన లిస్టులో ఉన్న ట్రైన్ల వివరాలు.. 1. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ 2. సికింద్రాబాద్-ఉందానగర్ మెము 3. మేడ్చల్-ఉందానగర్ మెము స్పెషల్ 4. ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ 5. సికింద్రాబాద్-ఉందానగర్ మెమె స్పెషల్ 6. హెచ్ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్ 7. సికింద్రాబాద్-మేడ్చల్ మెము 8. మేడ్చల్-సికింద్రాబాద్ మెము 9. కాకినాడ-విశాఖపట్నం […]
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్కీమ్‌లో భాగంగా 2022 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు పైగా కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్‌లో మరిన్ని ఐటమ్స్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన మహిళకు, పుట్టిన బిడ్డకు ఈ కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు […]
రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తాయంటే షెడ్యూలింగ్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సిగ్నలింగ్ సమస్యలు, అనుకోని అంతరాయాలు.. ఇలా పలు కారణాలు చెప్పొచ్చు. అయితే పశువుల వల్ల కూడా రోజుకి సగటున 11 రైళ్లు లేట్‌గా రాకపోకలు సాగిస్తున్నాయని రైల్వే శాఖ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల రైల్వేలకు భారీగా నష్టాలొస్తున్నాయి. మేత కోసం పశువులు రైల్వే ట్రాక్‌ల మీదికి వస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. అదే సమయంలో రైళ్లకు ఆటంకం […]
నాలుగేళ్లలో మెరుగుపడ్డ ఆర్థిక రంగం గడచిన నాలుగేళ్లలో దేశ ఆర్థిక రంగం పనితీరు స్థిరంగా మెరుగుపడింది. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ఈ విషయాన్ని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 10 ఎకానమీలపై విశ్లేషణ జరిపి ఫలితాలను వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎకనమిక్ రెజిలియెన్స్ (ఐఈఆర్) ర్యాంక్‌లే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఐఈఆర్ ర్యాంక్‌ల్లో మన దేశం 2019లో 6వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 2వ ర్యాంకుకి చేరుకోవటం విశేషం. ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రైవేట్ […]
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చు అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదేమోనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సరుకు రవాణా వ్యవస్థలో అవాంతరాల వల్ల నిత్యవసరాల ధరలు నింగినంటాయి. అయితే ఉక్రెయిన్‌పై నాలుగు నెలలుగా […]
ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా […]
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది గత రెండు రోజులుగా ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 4.4 అడుగుల వద్ద ఉంది. దీంతో 3 లక్షల 69 వేల 259 క్యూసెక్ల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. స్పిల్ వే ఎగువన 30.050 మీటర్లు, దిగువన […]
కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో టిఫిన్ ప్లేట్‌పై అంబేద్కర్ ఫొటోను ప్రింట్ చేసిన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. గంటలకొద్ది రావులపాలెం పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఈ వివాదం నేపథ్యంలో జరిగిన గొడవలో పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్లందరూ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా […]