PF Update: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇక వాళ్లు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటిదాకా కనీసం 6 నెలల అనుభవం ఉన్నోళ్లే పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇకపై అంతకన్నా తక్కువ సర్వీసు ఉన్నోళ్లు కూడా ఉపసంహరించుకునేందుకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే చాలా మంది ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే 1 నుంచి 6 నెలల లోపు ఉద్యోగం మానేసేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వాళ్లు వేరే సంస్థలో చేరితే యూఏఎన్ నంబర్ ఆధారంగా పాత, కొత్త పీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేసుకుంటారు. కానీ ఇతర సంస్థల్లో చేరనివాళ్లు పీఎఫ్ అకౌంట్లను అలాగే వదిలేస్తున్నారు.
వాటిలోని డబ్బును వెనక్కి తీసుకునే ఛాన్స్ లేక నష్టపోతున్నారు. 6 నెలల లోపు అనుభవం ఉన్నోళ్లు సైతం పీఎఫ్ ఖాతాల్లోని అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ ఇస్తే ఎంతో మందికి ఊరట లభిస్తుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో నమోదైన 73 లక్షల మంది పింఛన్‌దారులకు ఒకేసారి పెన్షన్‌ను డిపాజిట్ చేసేందుకు ఆమోదం లభించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలోని 138 రీజనల్ ఈపీఎఫ్‌ఓ ఆఫీసుల్లో వేర్వేరు తేదీల్లో లేదా ఒకే తేదీన వేర్వేరు సమయాల్లో అకౌంట్ హోల్డర్లకు డిపాజిట్ చేస్తున్నారు. లేటెస్ట్ ప్రపోజల్ ప్రకారం సెంట్రల్ సిస్టమ్ అమల్లోకి రానుంది. దీంతో అందరికీ ఒకేసారి పింఛన్ సొమ్ము అందనుంది.
Also Read
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!