Health Tips: మన ఇల్లే ఓ డయగ్నాస్టిక్ సెంటర్.. నిమిషంలో 6 పరీక్షలు.. ఈ పరికరంతో సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీర్ఘకాలికంగా బీపీ, షుగర్‌లతో బాధపడేవాళ్లు నెలకోసారో, రెండు మూడు నెలలకోసారో పరీక్షలు చేయించుకుంటే ఫలితాలు సరిగ్గా రావు. డైలీ టెస్టులు చేయించుకుంటే డైట్‌ని పక్కాగా ఫాలో అవ్వొచ్చు. తద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చాలా మంది.. రక్త పరీక్షలు చేయించుకోవాలంటే భయపడతారు. సూదిని చూసి వణికిపోతారు. ఇలాంటివారి కోసం (నీడిల్ ఫోబియా ఉన్నోళ్ల కోసం) కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు “ఏవ”(EYVA). హైదరాబాద్‌కి చెందిన బ్లూసెమీ అనే సంస్థ ఈ డివైజ్‌ని రూపొందించింది.
ఈ హెల్త్ గాడ్జెట్.. సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆల్గారిథమ్స్, స్మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీని సాయంతో సూది గుచ్చకుండా, రక్తపు చుక్క బయటికి రాకుండా 6 పరీక్షలు చేయొచ్చు. 1. బ్లడ్ గ్లూకోజ్ లెవల్ 2. హీమోగ్లోబిన్ ఏ1సీ (HBA1C) 3. ఈసీజీ 4. హార్ట్ రేట్ 5. బ్లడ్ ప్రెజర్ (బీపీ) 6. ఆక్సీజన్ శాచురేషన్. ఏవ పరికరం మీద బొటన వేలుని పెడితే చాలు. ఈ ఆరు పరీక్షల ఫలితాలు నిమిషంలో ప్రత్యక్షమవుతాయి. దీనికి అనుబంధంగా పనిచేసే ఒక మొబైల్ యాప్ కూడా ఉంది. దాని సాయంతో మన శరీరానికి సంబంధించిన డైలీ హెల్త్ అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఫిజికల్ ఫిట్‌నెస్, న్యూట్రిషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన సమస్యలేమైనా తలెత్తితే వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు తక్షణం డాక్టర్‌ని కలిసి ట్రీట్‌మెంట్ పొందొచ్చు. ఏ రోజు ఏ ఫుడ్ తింటున్నామో, దాన్నిబట్టి షుగర్ లెవల్స్ ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఇన్‌స్టంట్ రిజల్ట్స్ మంత్లీ టెస్టుల్లో బయటపడవు. “నిత్యం డయగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్లటం లేదా హోమ్ టెస్ట్ కిట్లు కొనుక్కోవటం ఖరీదైన వ్యవహారం. ఒక్కసారి ఏవ డివైజ్‌ని తీసుకుంటే తక్కువ ఖర్చుతో పనైపోతుంది” అని బ్లూసెమీ సంస్థ ఫౌండర్, సీఈఓ మద్దికట్ల సునిల్ అన్నారు.
నైట్ డ్యూటీల వల్ల గానీ ఇతరత్రా కారణాల వల్ల గానీ 25-40 ఏళ్ల మధ్య వయసువారు రోజూ లేటుగా నిద్రపోతుంటారు. అందువల్ల పొద్దున లేటుగా లేస్తారు. ఫలితంగా బ్రేక్ ఫాస్ట్ చేయరు. డైరెక్ట్ లంచ్ లాగించేస్తారు. అందులోనూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు. శారీరక ఆరోగ్యం కోసం వర్కౌట్లు చేయరు. అందుకే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ల కోసమే ఏవ పరికరాన్ని డెవలప్ చేసిట్లు సునిల్ తెలిపారు. ఏవ ధర రూ.15,500. కుటుంబంలో నలుగురు మనుషులు వాడుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి యావరేజ్‌గా రూ.4000 ఖర్చు వస్తుంది. డయగ్నాస్టిక్ సెంటర్లతో పోల్చితే ఇది 95 శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!