09-07-22 Business Updates: నేటి బిజినెస్ వార్తల్లోని ముఖ్యాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా వాహనాలు మరింత ప్రియం
టాటా వాహనాలు మరింత ప్రియమయ్యాయి. ప్రయాణికుల వాహనాల రేట్లను టాటా మోటర్స్ పెంచింది. దీంతో ఈ శ్రేణిలోని వాహనాలను ఇకపై సగటున 0.55 శాతం అధిక ధరలకు కొనాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని టాటా మోటర్స్ స్పష్టం చేసింది. తయారీ ఖర్చులను కాస్త తగ్గించుకునేందుకే రేట్లు పెంచామని వివరణ ఇచ్చింది. రోజురోజుకీ పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయం భారంగా మారుతోందని వెల్లడించింది.
Also Read
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
స్టాఫ్ భారాన్ని తగ్గించుకుంటున్న ఓలా
ఇండియన్ మల్టీ నేషనల్ రైడ్ షేరింగ్ కంపెనీ అయిన ఓలా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు స్టాఫ్ అప్రైజల్స్ పైనా నిర్ణయాన్ని వాయిదా వేసింది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రమోషన్లు, ఇక్రిమెంట్లు, బోనస్‌లు తదితర నిర్ణయాలు ఉండబోవని పరోక్షంగా తెలిపింది. అత్యధిక వాటాలను కొనుగోలు చేసి సాఫ్ట్ బ్యాంక్ ఆర్థికంగా సపోర్ట్‌గా నిలుస్తున్నా ఓలా ఇలా ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తుండటం గమనార్హం.
టెలికం రంగంలోకి అదానీ
దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన గౌతమ్ అదానీ గ్రూపు ఇకపై టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న హైస్పీడ్ ఇంటర్నెట్ బ్యాండ్ (5జీ స్పెక్ట్రం) వేలం ప్రక్రియలో పాల్గొనటంపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ సెక్టార్‌లో ఇప్పటికే రిలయెన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సంస్థలతో అదానీ గ్రూప్ పోటీకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది.
‘అవెన్యూ’ లాభం 680 కోట్లు
అవెన్యూ సూపర్‌మార్ట్స్ సంస్థ అద్భుత ఫలితాలను నమోదుచేసింది. మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) నివేదికను ఇవాళ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి 6 రెట్లు ఎక్కువ నికర లాభం వచ్చినట్లు తెలిపింది. ఆ విలువ రూ.680 కోట్లని పేర్కొంది. ఒక్క ఏడాదిలోనే 490.30 శాతం ప్రాఫిట్ పెరిగినట్లు ప్రకటించింది. ఇవి స్వతంత్రంగా ఆర్జించిన లాభాలేనని స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసిక లాభం రూ.115 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!