125 డాలర్ల నుంచి 101 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్ క్రూడాయిల్ ధర క్రూడాయిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. మార్చి నెలలో 125 డాలర్లు పలికిన ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఇప్పుడు 101 డాలర్లకు పడిపోయింది. ఈ పరిణామం అందరికీ ప్రయోజనకరమని చెప్పొచ్చు. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణానికి బదులు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టేందుకు దోహపడుతుంది. ప్రజల జీవన వ్యయం తగ్గుతుంది. కంపెనీలపై ప్రాథమిక ఆర్థిక ఒత్తిళ్లు తొలిగిపోతాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నిండుతుంది. ఎందుకంటే ఈ ఏడాది […]
షింజో అబే.. జపాన్ మాజీ ప్రధానమంత్రి. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్షుడు. 2006-07లో ఏడాది పాటు, 2012-2020లో 8 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. తద్వారా జపాన్‌కి ఎక్కువ కాలం (మొత్తం నాలుగు సార్లు) ప్రధానమంత్రిగా చేసిన ఘనత వహించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌కి ప్రధాని అయిన పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పారు. ప్రధాని కాకముందు 2005-06లో క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీగా వ్యవహరించారు. 2012లో కొన్నాళ్లపాటు ప్రతిపక్షనేతగానూ పనిచేశారు. మొదటిసారి 1993 ఎన్నికల్లో […]
హైదరాబాద్‌లో ఫ్లెక్సీల పరంపర కొనసాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ ఇవి వెలుస్తుండటం గమనార్హం. ఇటీవల కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పీఎం మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలతో కూడిన ఫ్లెక్సీలు రాత్రికిరాత్రే ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బ్యానర్లు కట్టారు. ఇంటి అవసరాలకు వాడుకునే ఎల్పీజీ […]
ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ కారక జన్యువులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) టూల్ అందుబాటులోకి రానుంది. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూపొందించిన ఈ పరికరాన్ని పివోట్ (PIVOT) అని పేర్కొంటారు. దీని సాయంతో ఏ పేషెంట్లో ఏ జన్యువు కారణంగా క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫలితంగా వ్యక్తి స్థాయి చికిత్స విధానాన్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పటివరకు ఒకే రకమైన క్యాన్సర్ రోగులకు ఒకే విధమైన ట్రీట్మెంట్ చేసేవారు. పివోట్తో ఈ పద్ధతిలో మార్పు రానుంది. […]
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. మూడోసారి కూడా విజయం సాధించాలని గట్టి పట్టుదల ప్రదర్శిస్తోంది. తదుపరి (2024) సాధారణ ఎన్నికల దిశగా అప్పుడే కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా సెగ్మెంట్లలో పార్టీని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ అనే పేరుతో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమాన్ని అన్ని […]