ఇస్త్రీ చేసేటప్పుడు దుస్తుల మీద లైట్‌గా నీళ్లు చల్లి తడుపుతారు. తద్వారా బట్టలను మెత్తగా, నీట్‌గా, ఐరన్ చేయటానికి అనుకూలంగా మడుచుకుంటారు. ఇది దాదాపు అందరూ చేసేదే. కానీ ఓ వ్యక్తి దీనికి కాస్త క్రియేటివిటీని జోడించాడు. అయితే అతను చేసిన ఈ పని చూస్తే మనకు నవ్వుతోపాటు పట్టరాని కోపం కూడా వస్తుంది. శుభ్రంగా ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయరా నాయనా అని ఇస్తే ఇలా ఎంగిలి నీళ్లతో గబ్బు గబ్బు చేయటాన్ని అస్సలు సహించలేం. దగ్గరుంటే ఒకటి తగిలిస్తాం కూడా. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
బాటిల్ నిండా నీళ్లు నింపి, పక్కన టేబుల్ మీద పెట్టుకొని, కొన్ని నీళ్లను గిన్నెలో తీసుకొని, నోట్లో పోసుకొని, ఐరన్ చేయాల్సిన డ్రస్‌ల మీద ఊస్తాడు. స్ప్రే కొడుతున్నట్లు షోయింగ్ చేస్తాడు. అదో అద్భుతమైన ఆలోచనలా బిల్డప్ ఇస్తాడు. ఆ తర్వాత గానీ ఇస్త్రీ చేయటానికి ఉపక్రమించడు. అతని పేరేంటో, ఊరేంటో తెలియదు. అడల్ట్ సొసైటీ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 30 లక్షల మందికి పైగా వీక్షించారు. ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు పెట్టారు. ఈ పోస్టింగ్‌కి “న్యాచురల్ వాటర్ స్ప్రేయర్” అనే క్యాప్షన్ తగిలించారు. అంకుల్ గివింగ్ పర్సనల్ టచ్ అంటూ ఒక నెటిజన్ చమత్కరించాడు.