Crazy News: శాలరీ మాట్లాడటానికి మా అమ్మను తీసుకురావొచ్చా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి పలు అనుమానాలు, భయాలు ఉంటాయి. శాలరీ ఎక్కువ అడిగితే మా దగ్గర ‘అంతలేదు’ అంటారేమోనని, ‘ఫోన్ చేస్తాం’ అని చెప్పి పంపిస్తారేమోనని అనుకుంటారు. అసలు అవకాశమే ఇవ్వరేమోనని ఆందోళన చెందుతారు. ఆల్రెడీ వేరే చోట ఉద్యోగం చేసేవాళ్లు మరో సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎక్స్‌పెక్టెడ్ శాలరీని ప్రస్తుత వేతనం కన్నా ఐదు వేలో, పది వేలో పెంచి చెప్పటానికి జంకరు. ఎందుకంటే కొత్తోళ్లు ఛాన్స్ ఇవ్వకపోయినా చేతిలో ఉద్యోగం ఉంది కదా అనే భరోసా ప్రదర్శిస్తారు.
కానీ ఏ పనీ లేక ఖాళీగా ఉండేవాళ్లు గతంలో తీసుకున్న శాలరీకి సమానమైన జీతం వచ్చినా సంతోషిస్తారు. ఇదంతా ఇప్పుడెందుకంటే శాలరీ మాట్లాడే అంశంపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టింగ్ క్రేజీ న్యూస్ అయింది. అందులో చమత్కారం ఉండటంతో యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. నితేష్ యాదవ్ అనే టెకీ ఈ పోస్టింగ్‌ని లింక్డిన్‌లో పెట్టాడు. ఎంత శాలరీ అడగాలో తెలియని పరిస్థితే తనకు ఎదురైతే ‘మా అమ్మను తీసుకురావొచ్చా?’ అని అడగాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆమె అయితేనే ఈ సమస్యను చక్కగా డీల్ చేస్తుందన్నాడు. ఈ బ్రిలియంట్ ఐడియా ఓ రేంజ్‌లో ఫన్ క్రియేట్ చేసింది.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
లక్ష లైకులను, వందల రియాక్షన్లను సొంతం చేసుకుంది. నెటిజన్లు సైతం దీనికి తగ్గట్లే కామెంట్లు పెట్టారు. ‘అమ్మ ఒక్కతేనా?. నాన్నను కూడా తీసుకురావటానికి అవకాశం ఉందేమో అడుగుతా’ అని ఓ వ్యక్తి స్పందించాడు. ‘మా అమ్మే గనక రంగంలోకి దిగితే హెచ్‌ఆర్ ఆఫీసర్ మూర్ఛపోవటం ఖాయమని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ‘అమ్మ మాత్రమే ఉత్తమ బేరం చేయగలదు’ అని ఇంకో యూజర్ అభిప్రాయపడ్డాడు. ‘అమ్మతోపాటు పక్కింటి ఆంటీనీ తీసుకొస్తే ఇంకా బాగా పనవుతుంది’ అంటూ నాలుగో నెటిజన్ కామెడీ చేశాడు. ఈ పరంపర ఇంకా కొనుసాగుతూనే ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.

తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?