SmartPhone: స్మార్ట్‌ఫోన్ యూజర్లు.. సేఫ్‌జోన్‌లో ఉండాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. ఇప్పుడు సమాచారమే మహాసంపద అంటున్నారు. డేటా ఈజ్ వెల్త్‌గా మారిపోయింది. ఎందుకంటే నిత్యం సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి అతి సామాన్యుల వరకు ఈ మోసాల వలలో చిక్కుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవటమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా సేఫ్ జోన్ దాటిపోయి డేంజర్ జోన్‌లోకి వెళుతున్నారని నిపుణులు అంటున్నారు. తద్వారా లక్షలాది రూపాయలను ఆన్‌లైన్ దొంగలపాలు చేస్తున్నారని వాపోతున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువ వాడే దేశాల్లో ఇండియా రెండో స్థానానికి చేరింది. మన కన్నా ముందు చైనా మాత్రమే ఉంది. ఇంటర్నెట్‌ను అధికంగా వినియోగిస్తున్నామంటే హ్యాకింగ్, సమాచార చోరీ అధికంగా జరిగే ప్రమాదం ఉందని అర్థం. చీప్‌గా వస్తున్నాయనే ఉద్దేశంతో మనోళ్లు ఎక్కువగా చైనా స్మార్ట్ ఫోన్లు కొంటున్నారు. కానీ అవి అంత సెక్యూర్ కాదు. దీనికితోడు మన దేశంలో సైబర్ సెక్యూరిటీ చట్టంలేదు. దీంతో మోసాలకు పాల్పడటం హ్యాకర్లకు ఈజీ అయిపోయింది. పైగా ఇంటర్నెట్ యూజర్లు అలర్ట్‌గా ఉండట్లేదు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఈ కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు విలువైన పర్సనల్ డేటా పరంగా, డబ్బుల పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మనం ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో పడకూడదంటే స్మార్ట్‌గా వ్యవహరించాలి. స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సూచించే సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఫాలో అవ్వాలి. లేకపోతే హ్యాకర్లు మన ప్రైవేట్ డేటాలోకి చొరబడే వీలుంది. కాబట్టి అప్డేట్ అలర్ట్ వచ్చినప్పుడు ప్రొసీడ్ అవ్వాలి తప్ప స్నూజ్ బటన్ నొక్కకూడదు. అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.
గూగుల్ ప్లే స్లోర్‌లో, యాపిల్ ప్లే స్టోర్‌లో ఉండే చాలా యాప్‌లు మన డేటాకి అత్యంత ప్రమాదకరం. యాప్ డెవలపర్‌ని, ఇతరత్రా వివరాలను, రివ్యూలను పరిశీలించాకే యాక్సెస్‌కి పర్మిషన్ ఇవ్వాలి. వాడని యాప్‌లకు పర్మిషన్లను ఎప్పుడూ స్విచ్చాఫ్ చేసి ఉంచటం బెటర్. ఇంటర్నెట్ వాడటం ద్వారా మనం ఎంటర్‌టైన్‌మెంట్ పొందుతాం. అందులో అనుమానమే లేదు. అయితే అదే సమయంలో కష్టాలను కోరితెచ్చుకోవద్దు. నకిలీ వెబ్‌సైట్ల బారినపడొద్దు. అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయొద్దు.
హెచ్‌టీటీపీ ప్రొటోకాల్ ఉన్న సైట్లనే చూడటం మంచిది. సాధ్యమైనంత వరకు ఆటోమేటిక్ అప్డేట్లను బ్లాక్ చేయటం ఉత్తమం. అంతేకాదు. స్ట్రాంగ్ లాగిన్ పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవాలి. ఓపెన్ వైఫైని అస్సలు వాడొద్దు. టు-ఫ్యాక్టర్-అథెంటికేషన్ సెటప్ చేసుకోవాలి. ఎక్కువ లాగిన్ ప్రయత్నాలు ఫలించనప్పుడు ఆ హిస్టరీని డిలీట్ చేసే ఆప్షన్‌ని ముందే సెలెక్ట్ చేసుకోవాలి. అవాస్ట్, మెకాఫీ వంటి సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను మన డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!