‘Fine’ Apple: ‘యాపిల్’కి జరిమానా. ఏ మోడల్ ఫోన్లూ అమ్మొద్దంటూ ఆ దేశం నిర్మొహమాటంగా ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Fine’ Apple: ‘యాపిల్’ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. ఛార్జర్ లేకుండా ఐఫోన్ అమ్మొద్దని బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ సంస్థను ఆదేశించింది. ఈ మేరకు అఫిషియల్ గెజిట్‌లో పేర్కొంది. ఫోన్‌కి ఛార్జర్ అవసరమని తెలిసినప్పటికీ ఆ సంస్థ ఉద్దేశపూర్వకంగానే వినియోగదారులపై వివక్ష చూపినట్లు తప్పుపట్టింది. ఈ తప్పు చేసినందుకు 2.38 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఇక మీదట ఛార్జర్ లేకుండా ఏ ఐఫోన్ మోడల్‌నీ విక్రయించొద్దని తేల్చిచెప్పింది. ఐఫోన్ 12తోపాటు కొత్త మోడళ్ల సేల్స్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇకపై రూపాయల్లోనే..
Also Read
- EPFO కొత్త పథకం.. 6 నెలలే అందుబాటులో ఉండే ఈ కొత్త స్కీమ్‌తో ఎవరికి లబ్ధి..? పూర్తి వివరాలు..
- Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
- PayPal Layoffs: పేపాల్‌లో భారీ లేఆఫ్స్.. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్..
- Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై మన కరెన్సీ రూపాయల్లోనే చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను తాము కూడా అమల్లోకి తెచ్చేందుకు టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో ఇండియా వాణిజ్యాన్ని పెంచాలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
షాపింగ్ పేజ్.. క్లోజ్!
సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్.. షాపింగ్ పేజీని తొలగించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ యాడ్ రెవెన్యూని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సంస్థ తన స్టాఫ్‌కి ఇంటర్నల్ మెమోని జారీచేసిందని సమాచారం. ఈ పరిణామంతో కంపెనీ ప్రాధాన్యతలు మారాయని ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది. యూజర్లు మరింత ఈజీగా షాపింగ్ చేసేలా మార్పులు చేర్పులు చేస్తున్నామని చెబుతోంది. ఫీడ్, స్టోరీస్, రీల్స్ మరియు లైవ్ షాపింగ్, డ్రాప్స్ వంటి ఇన్నోవేషన్స్ ద్వారా సబ్‌స్క్రయిబర్లు వివిధ ఉత్పత్తులను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
తాజావార్తలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్‌కు కాంగ్రెస్ సూచన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!