Stock Market Introduction: స్టాక్ మార్కెట్ అంటే ఏంటి?. ఈ ప్రశ్నకు చాలా మంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. న్యూస్ పేపర్లు చదవటం ద్వారానో, టీవీల్లో వాణిజ్య వార్తలు వినటం ద్వారానో కొద్దో గొప్పో అవగాహన పొందుతారు గానీ పూర్తిగా వివరించలేరు. అందుకే.. స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పోగొట్టుకునే ఒక జూదం లాంటిది అనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ ఆ అభిప్రాయం సరికాదు. అయితే.. సరైన నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే మాత్రం నష్టాల బారిన పడటం ఖాయం. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ముందుగా స్టాక్ మార్కెట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రి-ప్లాన్డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేవారికి ఇది ఒక సీరియస్ బిజినెస్ అని ‘వెల్త్‌ట్రీ’ గ్రూప్ సీఈఓ ప్రసాద్ దాసరి అన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే తెలుసుకోవాలనుకునేవారు, బిజినెస్ సబ్జెక్ట్‌పై లోతైన జ్ఞానాన్ని పొందాలనుకునేవారు Nbusiness Fin-Talk అందిస్తున్న ఈ వీడియో చూడొచ్చు.