Special Story on Startups in India: ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని లేదా సర్వీసును ప్రారంభించాలనుకునే ముందు దానికి మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటారు. స్టార్టప్ అనేది ఎప్పుడూ అధిక వ్యయం, అల్ప ఆదాయంతో మొదలవుతుంది. అందువల్ల దీనికి ఫండింగ్ అవసరం. స్టార్టప్ ఎదుగుతున్న క్రమంలో ఒక మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వ్యాల్యుయేషన్ పొందినప్పుడు దాన్ని మినీకార్న్ అంటారు. యూనికార్న్ అయ్యే ముందు సూనికార్న్‌గా పేర్కొంటారు.
అసలు.. యూనికార్న్ అంటే ఏంటి?
ఆర్థిక ప్రపంచంలో ప్రైవేట్ యాజమాన్యం కింద నడిచే.. ఒక బిలియన్ డాలర్లకి పైగా మార్కెట్ విలువ కలిగిన సంస్థనే యూనికార్న్ అంటారు. యూనికార్న్ అనే పదాన్ని తొలిసారిగా కౌబోయ్ కంపెనీ ఫౌండర్ Aileen Lee ఉపయోగించారు. సాధారణంగా టెక్ బేస్డ్ స్టార్టప్‌లలో ఫుడ్ టెక్, ఎడ్‌టెక్, బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేవి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి యూనికార్న్ 2011లో వచ్చింది. ఈ ఏడాది కొత్తగా 21 స్టార్టప్‌లు యూనికార్న్ క్లబ్‌లో చేరాయి. దీంతో ప్రస్తుతం మన దేశంలోని మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 107కి పెరిగింది. వీటి విలువ ఇంచుమించుగా 343 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటి టోటల్ ఫండింగ్ 94 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇండియాలో ప్రస్తుతం దాదాపు 60 వేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. దీంతో మన దేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా నిలిచింది.
స్టార్టప్‌కి విలువ కట్టడం
సహజంగా ఏ కంపెనీ వ్యాల్యుయేషన్ అయినా.. అది ఫైనాన్షియల్ లెవల్‌లో ఎంత బాగా పనిచేస్తోందనేదాన్నిబట్టి అంచనా వేస్తారని అందరూ భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఇన్వెస్టర్లు ఆ కంపెనీ మేనేజ్మెంట్, భవిష్యత్ ఆదాయ వ్యూహాలు, మార్కెట్ సైజ్, సాంకేతిక ఆవిష్కరణలు, మార్కెట్ స్థితిగతులకు తగ్గట్లు వచ్చే నష్టాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఎంట్రప్రెన్యూర్లు తమ స్టార్టప్ బిజినెస్ మోడల్‌ని వెంచర్ క్యాపిటలిస్టులకు సమర్పించే ముందు అనుసరించాల్సిన కొన్ని ముఖ్యాంశాలు.. ఆయా స్టార్టప్‌లు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను అధిగమించేందుకు తగిన పరిష్కార మార్గాన్ని ఆవిష్కరించాలి. కంపెనీ భవిష్యత్తు అవకాశాలు, ‘ఇన్స్ అండ్ ఔట్స్’పై ప్రజెంటేషన్ స్పష్టంగా ఉండాలి. మార్కెట్‌కు అనుగుణంగా ఉండే వ్యాపార ప్రణాళికను రూపొందించాలి.
స్టార్టప్, యూనికార్న్ మధ్య తేడాలేంటి?
శరవేగంగా అభివృద్ధి చెందే వ్యూహాన్ని అడాప్ట్ చేసుకోవటం వల్ల ఈ కంపెనీలు తక్కువ కాలంలోనే ఎక్కువ నిధులను సమీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో మార్కెట్‌లోని మిగిలిన పోటీ సంస్థల కన్నా ముందడుగు వేసేందుకు వీలుపడుతుంది. అప్పటివరకూ మార్కెట్‌లో లేని సరికొత్త ఆవిష్కరణల వ్యూహాలతో ముందుకు రావటంతో వీళ్లు మిగతా సంస్థల కన్నా భిన్నంగా ఉంటారు. కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేలా వాళ్లకు అనుగుణంగా ఉన్న ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఎక్కువ మంది వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. యూనికార్న్ స్టార్టప్‌లు యూజర్ ఫ్రెండ్లీగా ఉండటానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలను, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లను ఉపయోగిస్తాయి.
Telangana-Amazon Tie up: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో అమేజాన్ వెబ్ సర్వీసెస్ టైఅప్
యూనికార్న్‌లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?
స్టార్టప్‌లు ఫెయిల్యూర్ అవటానికి గల ముఖ్య కారణాల్లో మొదటిది క్యాష్ బర్న్. క్యాష్‌బర్న్ అంటే ఒక కంపెనీ.. యాడ్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షించడానికి పెట్టే ఖర్చు. ముఖ్య కారణాల్లో రెండోది.. మార్కెట్‌లోకి అడుగుపెట్టే సమయం. వినూత్నమైన ఆలోచనలతో వచ్చినప్పటికీ అది సరైన సమయం కాకపోతే వైఫల్యానికి దారితీస్తుంది. దీనికి ఉదాహరణగా Z.COMను చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక యూట్యూబ్ లాంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామే. అప్పట్లో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ తక్కువగా ఉండటంతో సక్సెస్ కాలేకపోయింది. మరొక ముఖ్యమైన కారణం.. కస్టమర్ల అవసరాలను తీర్చటం. ఈ వ్యాల్యూ డెలివరీ లేనప్పుడు గ్రోత్ తగ్గిపోతుంది.
మన దేశంలో వందకు పైగా ఉన్న యూనికార్న్ స్టార్టప్‌లలో కేవలం 23 మాత్రమే ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. కొన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటికి మీషోను మరియు పేటీఎంను ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. కార్పొరేట్ గవర్నెన్స్ లేకపోవటం కూడా వీటి ఫెయిల్యూర్‌కి ఒక కారణం. ఇది ఫండింగ్ పైనా ప్రభావం చూపుతోంది. 2022 ప్రారంభం నాటికి వేదాంతు, కార్స్24, ఓలా వంటి సంస్థలు 5 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల 11 వేల మంది స్టాఫ్‌ని రాత్రికి రాత్రే తీసేసినవాటిలో అన్‌అకాడమీ, బైజూస్ వంటి పేరొందిన సంస్థలు కూడా ఉన్నాయి.
ఇన్వెస్టర్లు లాభాల దిశగా ఒత్తిళ్లు తీసుకొస్తూ నిధుల్లో కోతపెట్టడం సైతం ఈ వైఫల్యానికి కారణమని కొంత మంది స్టార్టప్ ఫౌండర్లు పేర్కొన్నారు. ఇండియాలోని 140 కోట్ల మంది జనాభాలో 9 కోట్ల మందికి డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి. వీటి ద్వారా తమ పెట్టుబడులపై లాభాలు 6 శాతం నుంచి 25 శాతానికి పెరిగినా 35 కోట్ల రూపాయలు వస్తాయనే అంచనాతో ఉండేవారు. కానీ ఆ 9 కోట్ల మంది డీమ్యాట్ అకౌంట్ హోల్డర్లలో 3 కోట్ల మందికి మాత్రమే 10 వేలకు పైగా పెట్టుబడి పెట్టే వ్యక్తిగత సామర్థ్యం ఉంది. దీంతో వెంచర్ క్యాపిటలిస్టుల అంచనాలు తలకిందులయ్యాయి.
ఇండియాలో ఇన్ని యూనికార్న్‌లు ఎందుకున్నాయి?
జొమాటో, పేటీఎంలు ఐపీఓలకు వెళ్లి మార్కెట్‌లో లాభాలను ఆర్జించటంతో కొత్త స్టార్టప్‌లలో ఆసక్తి పెరిగింది. టెక్ బిజినెస్‌లలో గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండటంతో వెంచర్ క్యాపిటలిస్టులు ముందుగా వీటి వైపు మొగ్గు చూపించేవారు. వీటిలో దేశీయ పెట్టుబడులే కాకుండా విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 240 బిలియన్ డాలర్లలో 184 బిలియన్ డాలర్లు ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సే కావటం విశేషం. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఏర్పడ్డ ఇన్‌ఫ్లేషన్‌తో ఇన్‌కం తగ్గింది. మరియు, కొవిడ్ సమయంలో రిటైల్, రెస్టారెంట్స్ వంటి దాదాపు అన్ని వ్యాపారాలు మూతపడగా కొన్నింటి లాభాలు తగ్గుముఖం పట్టాయి.
దీనివల్ల వెంచర్ క్యాపిటలిస్టులు టెక్ బిజినెస్ నుంచి బయటకు వచ్చి మార్కెట్‌కి అనుగుణంగా ఉన్న కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ పెట్టారు. పైగా అప్పట్లో వెంచర్ క్యాపిటలిస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో వాళ్ల పెట్టుబడి వ్యయం ఎక్కువ ఉండటం వల్ల పోటీ అధికంగా ఉండేది. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా కొత్త స్టార్టప్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 21 స్టార్టప్‌లు యూనికార్న్ జాబితాలో చేరాయి. సమీప భవిష్యత్‌లో మరెన్నో రావటానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
మన దేశంలో ఈ ఏడాది కొత్తగా యూనికార్న్ క్లబ్‌లో చేరిన స్టార్టప్‌లు-వాటి మార్కెట్ విలువ (బిలియన్ డాలర్లలో)..
1. Fractal-1
2. Lead-1.1
3. Darwinbox-
4. Dealshare.com-1.62
5. Elasticrun-1.5
6. LIVSPACE-
7. Xpressbees-1.2
8. Uniphore-2.5
9. Hasura-
10. Credavenue-1.2
11. Amagi-1
12. Oxyzo-
13. Games24x7-
14. Open-
15. Physicswallah-1.1
16. Purple.com-1.1
17. Leadsquared-
18. One card-1.25
19. 5ire-1.5
20. Shiprocket-1.2
21. 1mg-1