IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్‌కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్‌ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్‌ని వివిధ ప్రచార మాధ్యమాల్లో చేపడతామని తెలిపింది. బంధుమిత్రులను భోజనానికి పిలవటానికి సహజంగా అందరూ ‘వీలైతే మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’ అని అంటుంటారు. భారతీయ సంప్రదాయాల్లో ఇదొక అలవాటు. దీనికి అనుగుణంగా ఈ బ్రాండ్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు ఐకియా ఇండియా పేర్కొంది.
బియ్యం ఎగుమతులపై ఆంక్షలు
దేశీయంగా బియ్యం సరఫరాను పెంచేందుకు, తద్వారా ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విదేశాలకు చేస్తున్న బియ్యం ఎగుమతులపై పరిమితులు పెట్టింది. కొన్ని రకాల బియ్యంపై నిషేధం, మరికొన్ని గ్రేడ్‌లపై 20 శాతం పన్ను విధించింది. దీంతో సామాన్యులకు ఊరట లభించనుంది. ఇండియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఇప్పుడు ఈ షిప్‌మెంట్ల సంఖ్యను కుదిస్తే ఆయా దేశాలకు రైస్ సప్లై తగ్గి రేట్లు పెరిగే అవకాశం ఉంది.
Special Story on Vinayaka Nimajjanam: వినాయక విగ్రహాలకే కాదు.. వివిధ వివక్షలకూ నిమజ్జనం..
రైల్వేలకు రూ.30 వేల కోట్లు!
రైల్వే మంత్రిత్వ శాఖ నూతన ఆదాయ వనరును గుర్తించింది. కొత్త ల్యాండ్ లైసెన్సింగ్ రుసుముల విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో 30 వేల కోట్ల రూపాయల రెవెన్యూని ఆర్జించాలని ఆశిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ ప్రకారం లీజుకు తీసుకున్న భూముల్లో చాలా వరకు టెర్మినల్ కార్యకలాపాలకు అవకాశం ఉన్నప్పటికీ పనికిరాకుండా పోతున్నాయని అభిప్రాయపడుతోంది. అయితే ఈ సవరించిన విధానం వల్ల కంటైనర్ కార్పొరేషన్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని అనలిస్టులు అంటున్నారు. జూన్ క్వార్టర్ రన్ రేట్ ప్రకారం కంటైనర్ కార్పొరేషన్ ఆదాయం 910 కోట్లు కాగా ల్యాండ్ లైనెన్స్ ఫీజు అందులో 40 శాతమేనని చెబుతున్నారు.