Talibans to ban TikTok, Pubg: టిక్‌టాక్, పబ్జీ కూడా బంద్!. ఇప్పటికే 2 కోట్ల 34 లక్షల వెబ్సైట్లు బ్లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talibans to ban TikTok, Pubg: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే 2 కోట్ల 34 లక్షల వెబ్సైట్లను బ్లాక్ చేసిన తాలిబన్ ప్రభుత్వం మరో నెల రోజుల్లో టిక్‌టాక్‌ను, మూడు నెలల్లో పబ్జీ యాప్‌ని సైతం బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ అధికార పగ్గాలను తాలిబన్లు చేజిక్కించుకున్న ఈ ఏడాది కాలంలో అనైతిక కంటెంట్‌ను ప్రచురించాయనే ఆరోపణలతో ఈ నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయా వెబ్సైట్లు కొత్త పేజీలతో పుట్టుకొస్తున్నాయని అసహనం ప్రదర్శించింది. కంటెంట్ నియంత్రణపై ఫేస్బుక్ సైతం తాలిబన్ అధికారులతో సహకరించట్లేదని అధికార వర్గాలు విమర్శించాయి. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మీడియాపై ఏ స్థాయిలో ఆంక్షలు విధించిందో దీన్నిబట్టి అర్థమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరగనున్న ‘ఓలా’ సెంటర్లు
Also Read
- Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
- Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
- 5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
- 37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ల సంఖ్య 200కి పెరగనుంది. ప్రస్తుతం ఈ కేంద్రాలు 20 మాత్రమే ఉన్నాయి. ఓలా తయారుచేసిన ఇ-స్కూటర్ల సేల్స్ పడిపోయిన నేపథ్యంలో కూడా ఆ సంస్థ నుంచి ఇలాంటి విస్తరణ ప్రణాళిక వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ వాహనాల రంగంలో ఓలా ఇప్పుడు నాలుగో స్థానానికి పరిమితమైంది. మొదటి మూడు స్థానాల్లో హీరో, ఒకినవ, ఏథర్ ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాన్ని ఓలా ఎలక్ట్రిక్ పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు లక్షా పాతిక వేలు
లాభం రూ.35 వేల కోట్లు
క్రూడాయిల్‌పై రష్యా ఇచ్చిన డిస్కౌంట్ల వల్ల మన దేశం 35 వేల కోట్ల రూపాయల వరకు లాభం పొందినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు రష్యా నుంచి ఇండియా చాలా తక్కువగా చమురును దిగుమతి చేసుకునేది. మన దేశ మొత్తం చమురు దిగుమతిలో రష్యా క్రూడాయిల్ శాతం ఒకటి కన్నా తక్కువే ఉండేది. యుద్ధం తర్వాత ఏకంగా 12 శాతానికి పెరిగింది. రష్యా నుంచి ఎక్కువగా చమురును కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా తర్వాత మనం రెండో స్థానంలో ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!