England Currency: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆ దేశానికి కొత్తగా రాజైన కింగ్ ఛార్లెస్-3 ఫొటోతో కూడిన కరెన్సీ నోట్లు 2024 మధ్య నుంచి చెలామణిలోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ తెలిపింది. ప్రస్తుతం వాడుతున్న పాలిమర్ నోట్లపై రాణి ఎలిజబెత్-2 ఫొటో1960 నుంచి కొనసాగుతోంది. ఆ నోట్లు మాసిపోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే సర్క్యులేషన్ నుంచి తొలగిస్తామని BOE వివరించింది.
ESIC to expand: ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 598 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ESICని 750 జిల్లాలకు విస్తరించనున్నట్లు కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ESIC పథకం కింద ఇప్పుడు 3 కోట్ల 90 లక్షల కుటుంబాలు, 12 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. ESICని భవన నిర్మాణ రంగానికి కూడా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు.
Bathukamma: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సందడి నిన్న మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండగ చేసుకుంటున్నారు. సాయంత్రం అవుతోందంటే చాలు చక్కగా ముస్తాబై వాడవాడలా వీధివీధినా కోలాటాలతో కోలాహలంగా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి ముదుసలి వరకు అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
Demat Accounts Jumped: ఏడాది వ్యవధిలోనే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 43 శాతం పెరిగింది. దీంతో మొత్తం అకౌంట్ల సంఖ్య 11 కోట్ల 45 లక్షలకు చేరినట్లు బీఎస్ఈ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ డేటా వెల్లడించింది. ఆగస్టు నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు గతంలో ఎన్నడూ లేనంతగా అంటే రూ.12,693 కోట్లు పెరిగాయి. డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరగటాన్ని బట్టి మన దేశంలో ఆర్థిక అక్షరాస్యత, ఇన్వెస్ట్మెంట్లు, స్టాక్ మార్కెట్లపై ప్రజల్లో అవగాహన పెరిగినట్లు భావించొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Samsung SmartPhones Sales: ఆన్లైన్ ఫెస్టివ్ సేల్స్‌లో మొదటి రోజే శామ్‌సంగ్‌కి సంబంధించి కోటి రూపాయలకు పైగా విలువైన స్మార్ట్ఫోన్ల సేల్స్ జరిగాయి. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరిగినట్లు శామ్సంగ్ ఇండియా వెల్లడించింది. 12 లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించామని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ఫోన్ల రేట్లను 17 శాతం నుంచి 60 శాతం వరకు తగ్గించింది.
Bala Bharathi School: తెలుగు రాష్ట్రాల్లోని పొదుపు సంఘాలు ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మహిళలు సాధించిన విజయం మాత్రం అతిపెద్ద విశేషమని, అద్భుతమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని చెప్పుకోవచ్చు. రూపాయితో పొదుపు మొదలు పెట్టి 7 కోట్ల రూపాయలతో ఒక స్కూల్ నిర్మించారు.
Stock Market Analysis: ఇండియా మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కె్ట్లు నిన్న అనూహ్యంగా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. కానీ.. రాబోయేది పండగ సీజన్ కాబట్టి ఎఫ్ఎంసీజీ లాంటి రంగాల్లోని కంపెనీల స్టాక్స్ రాణించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొడక్టుల కొనుగోళ్లు పెరగటం వల్ల ఆయా సంస్థలకు లాభాలు వస్తాయి.
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్‌తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.
UPI Lite: యూపీఐ పేమెంట్లు చెయ్యాలంటే మొబైల్లో డేటా ఉండాలి. దీంతోపాటు పిన్ కూడా తెలిసుండాలి. కానీ.. ఈ రెండూ లేకపోయినా పేమెంట్ చేసేందుకు లేటెస్ట్గా ‘యూపీఐ లైట్’ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ రీసెంట్గా ప్రారంభించారు. యూపీఐ లైట్ ద్వారా గరిష్టంగా 200 రూపాయలు చెల్లించొచ్చు. ముందుగా బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ లైట్ వ్యాలెట్లోకి అమౌంట్‌ను డిపాజిట్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ 2 వేల రూపాయలకు మించకూడదు.
Behind Story of Big Bazaar’s Downfall: ఫ్యూచర్ గ్రూప్‌లోని రిటైల్ బిజినెస్‌ను రూ.24,713 కోట్లకు అక్వైర్ చేస్తున్నట్లు రిలయెన్స్ గ్రూపు ప్రకటించడంతో మూడు దశాబ్దాల కిషోర్ బియానీ రిటైల్ సామ్రాజ్యానికి తెరపడింది. అయితే.. ఆ తెర వెనక ఏం జరిగింది?. అదే ఇవాళ్టి మన స్పెషల్ స్టోరీ. కిషోర్ బియానీ తన రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించిన 20 ఏళ్లలోనే దేశం మొత్తం విస్తరింపజేశారు. ఆయన మొట్టమొదట 1997లో కోల్‌కతాలో పాంథలూన్స్ను ప్రారంభించారు.