Shweta Tiwari: బాలీవుడ్‌లోని అందమైన భామల్లో శ్వేతా తివారీ ఒకరు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘‘నాకు పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంలేదు. మ్యారేజ్ చేసుకో అని నా కూతురిని కూడా బలవంతపెట్టను. ఆ విషయంలో తుది నిర్ణయం నా కూతురిదే. ఆమెకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేయమని చెబుతా. ఎవరి కోసమో మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదనే విషయాన్ని నా కూతురికి తేల్చిచెప్పాను. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకో అని కూడా అడ్వైజ్ చేశా.
ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే దాన్ని కంటిన్యూ చెయ్యమని చెబుతా. అంతేగానీ పెళ్లిదాకా తీసుకురావాలని మాత్రం ఆశించను. ప్రోత్సహించను. కొన్నేళ్లుగా నా ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్‌లా ఉండటం వల్ల నేను ఎలాంటి ఇబ్బందులూ పడలేదు. డబ్బుల కోసమో, మరో అవసరం కోసమో నా మాజీ భర్త సాయం కోరలేదు. ముందు ముందు కూడా కోరను. ప్రస్తుతం నేను ఆర్థికంగా బాగానే నిలదొక్కుకున్నా. అందుకే నా లైఫ్‌ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నా. మరో నాలుగైదేళ్లకు సరిపోను డబ్బులు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను ఎవరేం చెప్పినా వినదలచుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోను.
Psychological thriller: ‘వేద’ టీజర్ లాంచ్ చేసిన క్రియేటివ్ జీనియస్ సుక్కు!
నెగెటివ్ కామెంట్స్ ఫేక్ అకౌంట్స్ నుంచి వస్తుంటాయి. వెండి తెర మీద కన్నా బుల్లి తెర మీదైతే రోజూ కొత్తగా కనిపించొచ్చన్నదే నా కోరిక. ఈ మధ్య కాలంలో నాకు చాలా టీవీ షోల ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిలో నా మనసుకు నచ్చిన క్యారక్టర్ ఏదీ లేకపోవటంతో ఒప్పుకోలేదు. అలాంటి మంచి ప్రాజెక్టు కోసమే చానాళ్లుగా ఎదురుచూస్తున్నా. నేను నటించట్లేదంటే నాకు ఆఫర్లేమీ రావట్లేదేమో అని జనం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నాకు నచ్చలేదు కాబట్టే రిజెక్ట్ చేశానని వాళ్లు అర్థంచేసుకోవట్లేదు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు ఒక్కరితో కూడా కలిసుండట్లేదంటూ వాళ్లూ వీళ్లూ ఎన్నో అనుకుంటున్నారు.
కానీ నాకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్ల గురించి ఎవరూ ఏమీ మాట్లాడట్లేదేం?. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు ఇప్పుడు లైమ్‌లైట్‌లో లేరు కాబట్టి వాళ్లను ఎవరూ పట్టించుకోవట్లేదనుకుంటా. నేను ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాను కాబట్టే నా గురించి నానా రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. సెలబ్రిటీల గురించి ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పుకోవటం మామూలే. నా గురించి ఎవరేం అనుకున్నా నేను డోంట్ కేర్. నాకు వర్క్ ముఖ్యం. నా చేతిలో ఎప్పుడూ పని ఉండేలా చేస్తున్న దేవుడికి ధన్యవాదాలు. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకోను. నా తప్పొప్పుల గురించి నాకు బాగా తెలుసు.
పొరపాట్లు మనం చేసి వాటి ఫలితాలను అనుభవించేటప్పుడు వాటికి దేవుణ్ని నిందించటం సరికాదు. మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే వాస్తవాన్ని గ్రహించాను. మంచి, చెడు అనేవి పగలు, రాత్రి లాంటివి. మంచి జరిగినప్పుడు తలకెక్కించుకోవద్దు. రాసిపెట్టి ఉంటే చెడును ఎలాగూ తప్పించుకోలేం. అన్నింటికీ ముందే సిద్ధపడితే ఏం జరిగినా ఫీలవ్వం. నా కూతురు కూడా ఇంతే. గుడ్ అండ్ బ్యాడ్‌కి ముందే రెడీ అయింది. ఎవరి బాధలు వాళ్లవి. నేను ఎవరికీ ఇన్‌స్పిరేషన్‌లా ఉండాలనుకోవట్లేదు. ఎవరైనా నన్ను చూసి నేర్చుకొని స్వతంత్రంగా జీవిస్తానంటే నాకు అంతకన్నా కావాల్సిందేముంది?.
చెడును ఎంకరేజ్ చేసినా, అంగీకరించినా ఆ ప్రభావం నా పిల్లల మీద పడుతుంది. వాళ్లు చెడిపోతారు. అది నాకు ఇష్టంలేదు. ఒక్క రోజు, రెండు రోజులైతే రాజీపడతాం. కానీ జీవితాంతం అలాగే బతకాలంటే కష్టం. నా పిల్లలకే కాదు. ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యమని చెబుతాను. ఎవరైనా మనని వేలెత్తి చూపేలా ఉండకూడదు. పెళ్లి అనేది మన వ్యక్తిగత జీవితానికి ఆటంకంగా మారకూడదు. అలా అని పెళ్లిళ్లు అన్నీ బ్యాడ్ అని గుడ్డిగా అనను.
నా ఫ్రెండ్స్ చాలా మంది పెళ్లి చేసుకొని జీవితంలో మంచిగా సెటిల్ అయ్యారు. సంతోషంగా ఉన్నారు. వాళ్లను చూస్తే నాకూ హ్యాపీగా అనిపిస్తుంది. మరికొంత మంది ఫ్రెండ్స్ పెళ్లిచేసుకొని పర్సనల్ లైఫ్‌లో కాంప్రమైజ్ అవుతున్నారు. అలాంటి జీవితం వాళ్లకు గానీ వాళ్ల పిల్లలకు గానీ మంచిది కాదనేది నా ఉద్దేశం. ఈ తరహా సామాజిక కట్టుబాట్లకు బందీ కావొద్దని నా కూతురికి సూచిస్తున్నా’ అని శ్వేతా తివారీ వివరించారు.