Record Level Sales in Festive Season: మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావటంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల విలువ రికార్డ్ స్థాయిలో 61 వేల కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 5జీ ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61 శాతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్‌ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12 శాతం పెరిగి అత్యధిక రేటైన 242 డాలర్లకు చేరనుందని వివరించింది. కస్టమర్లు సహజంగా పండుగ రోజుల్లో, స్పెషల్ అకేషన్లలో కొత్త వస్తువులు కొంటుంటారు. కొందరు దీన్ని సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తాయి.
రూ.400 కోట్ల ఫండ్ రైజింగ్
బాండ్లు జారీ చేయటం ద్వారా కనీసం 400 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసేందుకు ఇండియన్ రెనివబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బాండ్లు 2025 అక్టోబర్‌లో మరియు 2032లో మెచ్యూరిటీకి రానున్నాయి. ఈ మేరకు బ్యాంకర్లతోపాటు ఇన్వెస్టర్ల నుంచి కూపన్ మరియు కమిట్‌మెంట్ బిడ్లను ఆహ్వానించినట్లు మూడు మర్చెంట్ బ్యాంకర్లు తెలిపారు. ఈ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా బాండ్లను జారీ చేసి ఒక బిలియన్ రూపాయలకు పైగా నిధులను సమీకరించింది.
Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
టాటా షేర్లు 6 నెలల్లో డబుల్
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ షేర్లు ఈ ఏడాది మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఇన్వెస్టర్ల డబ్బును ఆరు నెలల్లోనే రెట్టింపు చేశాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ఈ సంస్థ.. లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ సేవలందిస్తోంది. పెట్టుబడుల అమ్మకాల ద్వారా డివిడెండ్లు, వడ్డీలు, లాభాల రూపంలో సంస్థ ఆదాయం పెరుగుతుండటంతో షేర్లకు డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ వద్ద పెట్టుబడుల కంపెనీగా నమోదైన ఈ సంస్థ తన ఇన్వెస్ట్‌మెంట్లను లిస్టెడ్ మరియు అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతోంది.