APPSC Job Notifications: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 9 ప్రకటనలు ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ముఖ్య తేదీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్లలో పలు విభాగాల్లో వైద్యుల ఖాళీలను నింపనుంది.
RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్‌లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది.
SAIL Entered Trillion Club: లక్ష కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన ఎలైట్ క్లబ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ జాబితాలోకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా చేరింది. 2021-22 మధ్య కాలంలో 18.73 మిలియన్ టన్నుల హాట్ మెటల్ని మరియు 17.36 మిలియన్ టన్నుల క్రూడ్ స్టీల్‌ని ఉత్పత్తి చేసింది. ఈ సంస్థకు సంబంధించి ఇదే ఇప్పటివరకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావటం గమనించాల్సిన అంశం.
Rupee Effect on Foreign Education: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తోంది. తాజాగా 82 రూపాయలకు చేరువైంది. దీనికితోడు ద్రవ్యోల్బణం పెరగటం దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. సాధారణ ప్రజల నుంచి సంపన్నుల వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సించాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుమతులు, పర్యటనలు.. ఇలా అన్నీ పెనుభారంగా మారాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడాది వ్యవధిలో 75 నుంచి 82కు తగ్గింది.
Study Abroad: ‘విదేశీ విద్య’కు ఇండియాలో తామే మారుపేరుగా నిలవాలనుకుంటున్నామని యూని2గో(Uni2Go) అనే స్టార్టప్ కోఫౌండర్లలో ఒకరైన రితికా రెడ్డి అన్నారు. తన తండ్రి గత 21 ఏళ్ల నుంచి స్టడీ అబ్రాడ్ కౌన్సిలర్‌గా చేస్తున్నారని, ఫారన్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గరకు వస్తుండేవారని చెప్పారు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి వాళ్లలో ఎన్నో సందేహాలు ఉండేవని, తన తండ్రిని అడిగి నివృత్తి చేసుకునేవారని తెలిపారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టార్టప్‌కి రూపకల్పన
Top Five Gaming Companies in the World: ‘గేమింగ్ కంపెనీకి ఒక ఉదాహరణ చెప్పు’ అనే ప్రశ్నకు సమాధానం తెలియనివాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది.. ఇక ప్రపంచంలోని టాప్-5 గేమింగ్ కంపెనీల గురించి ఎంత మందికి తెలుస్తుంది?. అందుకే ప్రతిఒక్కరిలో ఇలాంటి స్టాండర్డ్, జనరల్ నాలెడ్జ్‌ని పెంపొందించేందుకు ‘ఎన్-బిజినెస్’ ఒక యూట్యూబ్ షార్ట్‌ని రూపొందించింది. అందులో ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ కంపెనీల వివరాలను పొందుపరిచింది.
Youtube Shorts: మన దేశంలో మొబైల్ ఫస్ట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ షార్ట్స్ తెరిచిన ద్వారమని ఆసియా-పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ విద్యాసాగర్ అన్నారు. రెండేళ్ల కిందట తొలిసారిగా ఇండియాలోనే యూట్యూబ్ షార్ట్స్‌ను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. యూట్యూబ్‌లో షార్ట్-ఫామ్ కంటెంట్‌ని క్రియేట్ చేయటం మరియు ఈజీగా వీక్షించటం కోసం వీటికి రూపకల్పన చేశామని చెప్పారు. యూట్యూబ్ షార్ట్స్.. ప్రపంచవ్యాప్తంగా ఒకటిన్నర బిలియన్ల కన్నా ఎక్కువ మంత్లీ లాగిన్ చేసే యూజర్స్ కమ్యూనిటీని పెంచుకున్నాయి.
Telangana and Four other rich States: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా రిజిస్టరైన మొత్తం కార్లు మరియు SUVల్లో దాదాపు 38 శాతం తెలంగాణ సహా 5 సంపన్న రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 14 లక్షల కార్లు మరియు SUVలు రిజిస్టర్ కాగా అందులో 5 లక్షల 4 వేల వాహనాలు ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తెలంగాణ, గుజరాత్‌లలోనే నమోదయ్యాయి. ఒడిశా, అస్సాం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి 5 అత్యంత పేద రాష్ట్రాల్లో 18.9 శాతం…
Special Story on Anil Agarwal: అనిల్ అగర్వాల్.. వ్యాపార రంగంలో ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇవాళ ఇండియన్ మెటల్ అండ్ మైనింగ్ మ్యాగ్నెట్‌గా ఎదిగారు. ఒక్క రోజు కూడా కాలేజీకి గానీ బిజినెస్ స్కూల్‌కి గానీ వెళ్లకుండానే ఆయన ఇదంతా సాధించగలగటం విశేషం. ఇంగ్లిష్‌లో ఎస్ అండ్ నో అనే రెండు పదాలు మాత్రమే తెలిసిన అనిల్ అగర్వాల్.. ఒకానొక దశలో ఆ ఇంగ్లిష్ కంట్రీ బ్రిటన్ నడిబొడ్డున ఇండియా […]
Brahmotsavalu in Tirumala: ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.