Demat Accounts Jumped: ఏడాది వ్యవధిలోనే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 43 శాతం పెరిగింది. దీంతో మొత్తం అకౌంట్ల సంఖ్య 11 కోట్ల 45 లక్షలకు చేరినట్లు బీఎస్‌ఈ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ డేటా వెల్లడించింది. ఆగస్టు నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు గతంలో ఎన్నడూ లేనంతగా అంటే రూ.12,693 కోట్లు పెరిగాయి. డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య భారీగా పెరగటాన్ని బట్టి మన దేశంలో ఆర్థిక అక్షరాస్యత, ఇన్వెస్ట్‌మెంట్లు, స్టాక్ మార్కెట్లపై ప్రజల్లో అవగాహన పెరిగినట్లు భావించొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో కేవలం 8 శాతం మందే ఈ ఫైనాన్షియల్ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారనే వాస్తవాన్ని మర్చిపోకూడదని, ఇది చాలా తక్కువ సంఖ్య అని అంటున్నారు.
వచ్చే నెల 4న ‘బజాజ్’ ఐపీఓ
అక్టోబర్ 4వ తేదీన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రానుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 500 కోట్ల రూపాయలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ మూడు రోజుల పాటు కొనసాగి వచ్చే నెల 7న ముగుస్తుంది. IPO ద్వారా సమీకరించనున్న నిధుల్లో 111 కోట్లను వ్యాపార విస్తరణ కోసం, 220 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం, 55 కోట్లను రుణాల చెల్లింపుల కోసం కేటాయించనుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కి దేశవ్యాప్తంగా 112 స్టోర్లు ఉన్నాయి.
Samsung SmartPhones Sales: సీజన్ మొదటి రోజే ‘పండగ’ చేసుకున్న శామ్‌సంగ్
రూ.21 వేల పన్ను నోటీసు
బెంగళూరుకి చెందిన గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీ బెట్టింగ్ అమౌంట్‌పై జీఎస్‌టీ ఎగవేతకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆ సంస్థకు 21 వేల కోట్ల పన్ను నోటీసు జారీచేశారు. 2017 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఈ పన్ను ఎగ్గొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీ సంస్థ రమ్మీ కల్చర్, గేమ్‌జీ, రమ్మీ టైమ్ వంటి ఫ్యాంటసీ గేమ్స్‌ని మరియు కార్డులు, క్యాజువల్ రూపంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ని ప్రమోట్ చేస్తోందనే టాక్ ఉంది.