Andhra Pradesh-Financial Inclusion: ప్రజలకు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఆవశ్యకతను మరింతగా వివరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ జాబితాలోలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఈ ప్రత్యేక ప్రచారం ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతుంది.
Wind Man of India: సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థకు ఫౌండర్గానే కాకుండా ‘విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కూడా పేరొందిన తుల్సి తంతి కన్నుమూశారు. మన దేశంలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు కావటం చెప్పుకోదగ్గ విషయం. తుల్సి తంతి క్లీన్ ఎనర్జీ సెక్టార్లో సైతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం విశేషం. సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 8 వేల 5 వందల 35 కోట్ల రూపాయలకు పైగా నమోదు అయింది.
Special Story on ONDC: ఓఎన్డీసీ అంటే.. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇది ఇ-కామర్స్ కోసం ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇ-కామర్స్‌కి సంబంధించి యూపీఐ లాంటిది. ఆన్లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక విప్లవం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలాగే డిజిటల్ కామర్స్‌లో కూడా ఓఎన్డీసీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తుందనే అంచనాతో మొదలైంది. వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే ఇదొక ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్.
Margadarsi Chit Fund: ఈ ఆర్థిక సంవత్సరంలో మార్గదర్శి చిట్‌ఫండ్ టర్నోవర్ 12 వేల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ శైలజా కిరణ్ చెప్పారు. గతేడాది టర్నోవర్ 9 వేల 7 వందల 12 కోట్ల రూపాయలని తెలిపారు. మార్గదర్శికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. ఈ 60 ఏళ్లలో 60 లక్షల మందికి పైగా చందాదారులకు సేవలందించామని శైలజా కిరణ్ పేర్కొన్నారు.
Zee Media Goodbye to BARC: బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే సంగతి తెలిసిందే. టీవీ వీక్షకుల సంఖ్యను లెక్కించే ఈ సంస్థకి ‘జీ మీడియా’ గుడ్‌బై చెప్పింది. దీంతో ఈ గ్రూపులోని 10 భాషలకు చెందిన 14 జాతీయ మరియు ప్రాంతీయ న్యూస్ ఛానళ్లు బార్క్ రేటింగ్‌కి దూరంగా ఉండనున్నాయి. ఎస్సెల్ గ్రూప్ కంపెనీ అయిన జీ మీడియా ఈ మేరకు బార్క్‌కి లెటర్ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Telio EV CEO Amit Singh: విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సర్వీసుల విషయంలో తమ సంస్థ భవిష్యత్తులో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌లో ఉంటుందని ‘టెలియొ ఈవీ’ సీఈఓ అమిత్ సింగ్ తెలిపారు. ఈవీ సెగ్మెంట్లో మరింత మంచి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈవీలు ఎక్కువ ఉంటే ఛార్జింగ్ స్టేషన్లు లేవని, ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటే వాటికి తగ్గ వాహనాలు లేవని చెప్పారు.
EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్‌ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం.
Hero Ramcharan for Hero Company: హీరో మోటోకార్ప్ సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రాంచరణ్తేజ్ని నియమించుకుంది. గ్లామర్ ఎక్స్‌టెక్ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. బైక్ స్టైల్, సేఫ్టీ మరియు పెర్ఫార్మెన్స్కి హీరో రాంచరణ్ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఇదిలాఉండగా.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్ ఎక్స్‌టెక్ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల రాంచరణ్‌తేజ్ సంతోషం వ్యక్తం చేశారు.
IPO: స్టాక్ మార్కెట్ బిజినెస్ అంటే ప్రపంచ స్థాయి కంపెనీలతో పార్ట్నర్షిప్ ఏర్పాటుచేసుకోవటం. షేర్ హోల్డర్‌గా మారటం ద్వారా ఆయా కంపెనీలతో కలిసి ప్రయోజనాలను పొందటం. షేర్ హోల్డర్‌గా మారటానికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే కంపెనీలు డైరెక్ట్‌గా వాళ్లదాంట్లో వాటాను ఆఫర్ చేయటం. చాలా మంది ఏమీ తెలియకుండా ఐపీఓకి అప్లై చేస్తుంటారు.
AP RGUKT Selection list 2022: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) పరిధిలోని 4 ఐఐఐటీ క్యాంపస్‌లలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (ఆరేళ్ల ఇంటిగ్రెటెడ్) కోర్సుల్లో ప్రవేశాలకు తాత్కాలికంగా అర్హులైన విద్యార్థుల జాబితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు.