Top Five Sportswear in the World: సచిన్ టెండుల్కర్ని చూస్తే ఎంఆర్ఎఫ్ బ్రాండ్ గుర్తుకొస్తుంది. సానియా మీర్జా కనపడగానే జీవీకే కంపెనీ పేరు కళ్ల ముందు కదులుతుంది. క్రీడాకారులు ధరించే బ్రాండ్స్‌కి ఆ రేంజ్లో గుర్తింపు వస్తుంది. ఆయా సంస్థలు ప్రపంచం మొత్తం తెలిసిపోతాయి. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ ఫీల్డ్‌లో లేరు. రిటైర్ అయ్యారు. కానీ.. ఇతర ప్లేయర్లు కొందరు వాళ్ల రేంజ్‌లోనే అభిమానులను అలరిస్తున్నారు. తద్వారా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
MohanBabu University: స్వప్నించు (డ్రీమ్), విశ్వసించు (బిలీవ్), సాధించు (అఛీవ్) అని బోధిస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ).. అనుభవజ్ఞులు, అత్యుత్తమ ప్రతిభ కలిగినవారు, అకడమిక్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంబీయూ సక్సెస్ స్టోరీలో పాలుపంచుకోవాలని కోరుతోంది. విద్యా రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో, నమ్మకానికి మారుపేరుగా మారిన తమ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది.
Special Story on Global Recesssion Fears: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం శరవేగంగా దూసుకొస్తోంది. ఈ మేరకు పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు వెలువడకపోయినప్పటికీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలు సూచాయగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, జీరో కొవిడ్ పాలసీలో భాగంగా చైనా పాల్పడుతున్న క్రూరమైన చర్యలు, ద్రవ్యోల్బణం మరియు మంకీపాక్స్ కేసులతో స్టాక్ మార్కెట్లలో, ఎకానమీల్లో ఉత్సాహం కరువైంది.
Special Story on Tulsi Tanti: సాధారణంగా ఒక వ్యక్తికి మహాఅయితే ఒకటీ రెండు విశేషణలు మాత్రమే ఉంటాయి. కానీ ఏకంగా ఆరేడు విశేషణలు ఉన్నాయంటే వాటిని బట్టే ఆయన గొప్పతనమేంటో తెలిసిపోతుంది. ఇండియాలోని పవన విద్యుత్ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా నిలవటమే కాకుండా క్లీన్ ఎనర్జీ సెక్టార్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయనే తుల్సి తంతి. విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. గ్రీన్ ఎనర్జీ ఎక్స్పర్ట్. ఫాదర్ ఆఫ్ రెనివబుల్ ఎనర్జీ ఇండస్ట్రీ. ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్. హీరో ఆఫ్ ది…
Gautam Thapar: ‘అవంత’ గ్రూప్ ప్రమోటర్ మరియు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మాజీ చైర్మన్ గౌతమ్ థాపర్‌కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ నుంచి నిధులను దారిమళ్లించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో తుది ఆదేశాలను జారీ చేసింది.
Gold Supplying Banks: గోల్డ్ సప్లై బ్యాంక్‌లు ఇండియాకి షిప్మెంట్లను తగ్గించాయి. మన దేశానికి బదులుగా చైనా, టర్కీ మరియు ఇతర మార్కెట్లకు బంగరాన్ని తరలించాయి. ఇండియాలో దసరా, దీపావళి వంటి పెద్ద పండుగలున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన కన్నా ఆయా దేశాల్లోనే బెటర్ ప్రీమియమ్ ఆఫర్లు ఉండటంతో అటు వైపు ఫోకస్ పెట్టాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మార్కెట్ అయిన ఇండియాలో బంగారం కొరత నెలకొననుంది.
Dr.Reddy’s-LIC: ప్రముఖ ఫార్మాస్యుటికల్ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా పెరిగింది. గత మూడు నెలల కాలంలో ఓపెన్ మార్కెట్లో 33 పాయింట్ ఎనిమిది ఆరు లక్షల షేర్లను కొనుగోలు చేయటంతో ఎల్ఐసీ షేరు 7 పాయింట్ 7 శాతానికి చేరింది. గతంలో డాక్టర్ రెడ్డీస్‌లో ఎల్ఐసీ షేరు 5 పాయింట్ ఆరు ఐదు శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. జూన్ 15 నుంచి గత నెలాఖరు వరకు జరిగిన షేర్ల కొనుగోలు వివరాలను డాక్టర్ రెడ్డీస్…
Union Nari Shakti Scheme: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూనియన్ నారీ శక్తి పథకంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్లకు పైగా రుణాలను మంజూరుచేసింది. దేశం మొత్తమ్మీద 10 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వాళ్ల అవసరాలను బట్టి లోన్ అమౌంట్‌ను నిర్ణయిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ మినోచి చెప్పారు.
Business Mint: సమాజంలో అద్భుతమైన వ్యక్తులు చాలా మందే ఉంటారు. కానీ.. వాళ్లలో కొందరు మాత్రమే అందరి చేత గుర్తింపు పొందుతారు. అయితే.. అది సరికాదని, ప్రతిభ ఉన్న ప్రతిఒక్కరూ ప్రపంచానికి తెలియాలని బిజినెస్‌మింట్ అనే సంస్థ సంకల్పించింది. అలాంటి ప్రొఫెషనల్స్‌ని వెలుగులోకి తెచ్చేందుకు నిజాయతీగా ప్రయత్నిస్తోంది. మీరు చేసే పనిలో/అందించే సర్వీసులో/మేనేజ్మెంట్లో క్వాలిటీ ఉందా?. అయితే మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా బిజినెస్‌మింట్ దృష్టిలో పడతారు.
Special Interview with World Renowned Gastroenterologist Dr. Guru N Reddy: డాక్టర్ గురు ఎన్ రెడ్డి.. ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. హైదరాబాద్‌లోని ప్రముఖ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు. వైద్యంలో నాలుగు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం కలిగిన విశిష్ట వ్యక్తి. ఈ రంగంలో అద్భుత విజయాలను సాధించిన ముందుచూపున్న మంచి మనిషి.