AP RGUKT Selection list 2022: ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని 4 ఐఐఐటీ క్యాంపస్‌లలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (ఆరేళ్ల ఇంటిగ్రెటెడ్) కోర్సుల్లో ప్రవేశాలకు తాత్కాలికంగా అర్హులైన విద్యార్థుల జాబితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఆర్కే వ్యాలీ, నూజివీడు, ఒంగోల్, శ్రీకాకుళం క్యాంపస్‌లకు ప్రొవిజనల్‌గా సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్ (https://admissions22.rgukt.in/ind/home)లో పొందుపరిచారు.
ఈ జాబితాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ వివరాలనూ పొందుపరిచారు. విజయవాడలో ఉదయం 11.00 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్ తేదీలు, వేదికల వివరాలను కూడా వెల్లడించారు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి 17వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ రిజల్ట్స్ విడుదల
ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్ బోర్డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డ్ కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. http://bieap.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.