EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్‌ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం. తద్వారా వచ్చే ఐదేళ్లలో రెండున్నర బిలియన్ డాలర్ల విలువైన ‘నిర్వహణలో ఉన్న ఆస్తులను’ సాధించటం ద్వారా తన ఉనికిని పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఈమధ్య ఇలాంటి యాప్ బేస్డ్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఎర్లీ శాలరీ (ఫైబ్) బాగా పాపులర్ అయిన లోన్ యాప్‌ల్లో ఒకటిగా నిలిచింది.
టీవీఎస్ స్కాలర్‌షిప్‌లు
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ ముందుకొచ్చింది. ఫారన్, కామన్వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. లీడర్స్‌గా మరియు డెసిజన్ మేకర్స్‌గా ఎదిగేందుకు తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శించే అభ్యర్థులను దేశాల వారీగా ఎంపిక చేస్తామని సంస్థ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. FCDOతో మరియు బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నట్లు చెప్పారు. భవిష్యత్ నాయకులను తయారుచేసేందుకు మరియు ఆ అభ్యర్థులకు తమ జర్నీలో ససోర్ట్ చేసేందుకు నిబద్ధతతో పాటుపడతామని పేర్కొన్నారు.
read also: Hero Ramcharan for Hero Company: హీరో విత్ ‘హీరో’. కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్
కేంద్రానికి పన్నుల ఊరట
కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కాస్త ఊరట లభించింది. జీఎస్టీతోపాటు ఇతర పన్నుల వసూళ్లు గతేడాది కన్నా ఈసారి 30 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో మార్కెట్ నుంచి రుణాలను కొంచెం తక్కువే తీసుకోవాలని నిర్ణయించుకుంది. 14.31 లక్షల కోట్ల లోన్ తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు దాన్ని 14.21 లక్షల కోట్లకు తగ్గించుకుంది. వచ్చే ఏడాది మార్చితో ముగిసే అర్ధ వార్షికంలో 5.92 లక్షల కోట్లు మాత్రమే రుణం సేకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.