Today (19-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు సూచీలు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ కాసేపట్లోనే లాభాల బాట పట్టి చివరికి భారీ ప్రాఫిట్స్‌తో ముగిశాయి. సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 61 వేల 806 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 157 పాయింట్లు ప్లస్సయి 18 వేల 426 పాయింట్ల వద్ద ముగిసింది.
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్‌కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్‌లో కార్ల కొనుగోళ్లలో 26 శాతం గ్రోత్ నెలకొంది.
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసిన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. 88 శాతానికి పైగా ఎక్స్‌పోర్ట్స్ కేవలం5 రాష్ట్రాల నుంచే జరగటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య విషయంలో ఏపీ కంటే బీహారే బెటర్ పొజిషన్లో ఉందని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ చెప్పారు.
EMIs High-No Extension: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరోసారి రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరుగుతుందా?.. లేక.. ఈఎంఐ మరింత భారంగా మారుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రెపో రేటు పెరిగిన ప్రతిసారీ వినియోగదారులు ఈఎంఐ అమౌంట్‌ని పెంచుకోకుండా లోన్ రీపేమెంట్ డ్యూరేషన్ని పెంచుకునేవారు.
Small Loans-Better Payments: ‘‘చిన్న కుటుంబం.. చింతల్లేని కుటుంబం..’’ అంటారు కదా. ఆ మాటను.. బ్యాంక్ లోన్లకు కూడా వర్తింపజేయొచ్చనిపిస్తోంది. ఎందుకంటే.. చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకున్నవాళ్లు చెల్లింపులను తూచా తప్పకుండా చేస్తున్నారు. ముద్ర అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద లోన్లు తీసుకున్న కస్టమర్లను దీనికి ఉదాహరణగా చూపొచ్చు. 2015లో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో భాగంగా 3 రకాల రుణాలు మంజూరు చేస్తారు.
Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.
No Change in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు శుక్రవారం కూడా దాదాపు నిన్నటి సీనే రిపీటైంది. ఇవాళ మొత్తం దాదాపుగా నష్టాల బాటలోనే సాగింది. ఎర్లీ ట్రేడింగ్‌లో కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినా ఆ ఆనందం ఆదిలోనే ఆవిరైంది. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచటం వల్ల విదేశాల నుంచి నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టడం బాగా మైనస్ అయింది.
Cement Rate Hike: దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా ధర రాన్రాను మరింత భారమవుతోంది. ఈ నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తయారీ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో సిమెంట్ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్‌లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.
Special Focus on Amazon: అగ్రరాజ్యం అమెరికాలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అమేజాన్‌కి మన దేశంలో బిజినెస్ పైన పెద్ద ఆశలే ఉండేవి. ప్రపంచంలో శరవేగంగా వృద్ధిచెందుతున్న మార్కెట్లలో ఇండియా కూడా ఒకటి కావటమే దీనికి కారణం. అందుకే ఇక్కడ గత పదేళ్లలో ఆరున్నర బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. టాప్ పొజిషన్‌ను సొంతం చేసుకోవాలని ఆశించింది. కానీ.. ఇటీవలి పరిణామాలను బట్టి చూస్తుంటే అమేజాన్ కలలు కల్లలవుతున్నాయా?
No.of Airports in India After Modi: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక.. దేశంలో ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. ఆయన తొలిసారి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 140కి పెరిగాయి. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య ట్రిపుల్ కానుందని.. అంటే.. 220కి చేరనుందని అధికారులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు గోవాలో మోపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.