Cement Rate Hike: దేశవ్యాప్తంగా సిమెంట్ బస్తా ధర రాన్రాను మరింత భారమవుతోంది. ఈ నెలలో 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తయారీ సంస్థలు ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో సిమెంట్ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్‌లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ విషయాన్ని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది. దేశంలోని పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో సిమెంట్ ధరలు ఫ్లాట్‌గా ఉండగా.. ఉత్తర, తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో కొంచెం హార్డ్‌గానే ఉన్నాయని వివరించింది. సిమెంట్ బస్తా రేటు ఎంత పెరగనుందనే విషయం కొద్ది రోజుల్లోనే వెల్లడి కానుందని పేర్కొంది. అయితే.. ఏసీసీ, అంబుజా సంస్థల సిమెంట్ ఉత్పత్తి మరియు అమ్మకాల ఒత్తిళ్లు ఈ నెలలో పరిమితంగానే ఉన్నాయి.
read also: Special Focus on Amazon: ఇండియన్ మార్కెట్‌లో అమేజాన్ ప్రస్తుత పరిస్థితేంటి?
ఇది సమీప భవిష్యత్తులోని ధరల ధోరణికి సానుకూల పరిణామమని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అభిప్రాయపడింది. సిమెంట్ బస్తా రేటు పెరగటం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో పరిశ్రమ లాభదాయకత ఒక్కో టన్నుకి 200 రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల్లో ఈ ప్రాఫిటబిలిటీ మరింత ఎక్కువని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది.