Today (26-12-22) Business Headlines: ఇండియా.. ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’: భారతదేశం ప్రపంచ ఔషధాగారంగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. సరసమైన రేట్లు మరియు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో మందులను తయారుచేస్తూ ఇండియా.. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు 50 శాతం, అమెరికాకు 40 శాతం, బ్రిటన్‌కి 25 శాతం, గ్లోబల్ వ్యాక్సిన్లలో 60 శాతం, WHO ఇమ్యునిటీ ప్రోగ్రామ్స్‌కి 70 శాతం మెడిసిన్లను మన దేశమే అందిస్తుండటం…
Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్‌లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఫౌండర్ పవన్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్. ‘ఎన్-బిజినెస్‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూలో పవన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.
New Year 2023: ఇండియాలో గతేడాది 46 కంపెనీలు యూనికార్న్ హోదా పొందగా ఈ సంవత్సరం 22 సంస్థలే ఈ స్టేటస్ సాధించాయి. అంటే కొత్త యూనికార్న్‌ల సంఖ్య సగం కన్నా తక్కువకు పడిపోయింది. అయితే.. ఫ్యూచర్ యూనికార్న్‌లు ఈ ఏడాది భారీగానే పెరిగాయి. ఈ విషయాలను రెండు వేర్వేరు సంస్థల నివేదికలు వెల్లడించాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద స్టార్టప్స్ అండ్ యూనికార్న్స్ ఎకోసిస్టమ్‌గా ఇండియా ఎదగటం విశేషం.
Today (23-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ఘోరాతిఘోరంగా అంతమైంది. వరుసగా నాలుగో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం సైతం భారీ నష్టాలను మూటగట్టుకుంది. అసలే గ్లోబల్ ఇన్వెస్టర్ల మూడ్ ఏమాత్రం బాగలేకపోవటం, దీనికి కొవిడ్-19 భయాలు తోడవటంతో షేర్ల కొనుగోళ్లు నిల్.. స్టాక్స్ విక్రయాలు ఫుల్.. అన్నట్లుగా ఈ రోజంతా కొనసాగింది. రెండు సూచీలు కూడా అనూహ్యంగా బెంచ్ మార్క్‌లను బ్రేక్ చేసి డౌన్ అయ్యాయి.
Today (23-12-22) Business Headlines: ఎయిర్టెల్-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్టెల్ మరియు అపోలో హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్ గ్లోబల్, ఏడబ్ల్యూఎస్ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి.
Tody (22-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్.. నిన్న బుధవారం మాదిరిగానే.. ఇవాళ గురువారం కూడా లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసింది. వరుసగా రెండో రోజూ కొవిడ్ భయాలు కొనసాగాయి. ఇన్వెస్టర్లు కొత్త షేర్ల కొనుగోలు కన్నా అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో రెండు సూచీలూ నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు తగ్గి 60 వేల 826 పాయింట్ల వద్ద ముగిసింది.
Indian Economy Growth in 2023: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు వృద్ధిని అధిగమించగలదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో మూలధన ఖర్చులు పుంజుకోవటం, వినియోగ సామర్థ్యం అధికం కావటం మరియు మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగటం వంటివి ఈ దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు. గ్లోబల్ ఎకానమీ పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలు కలిగించనున్నప్పటికీ వృద్ధి మాత్రం 4.8 శాతం నుంచి 5.9 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.
Subscribers Want Free Content On OTTs: మన దేశంలో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం వెండి తెర కన్నా బుల్లి తెర కన్నా ఓటీటీకే ఎక్కువ ఓటేస్తున్నారు. దీంతో గతేడాది కన్నా ఈ సంవత్సరం ఓటీటీ ఆడియెన్స్ సంఖ్య 20 శాతం పెరిగింది. ఇండియాలో ప్రస్తుతం ఓటీటీ వీక్షకుల సంఖ్య 42 పాయింట్ మూడు 8 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ‘‘ది ఆర్మాక్స్ ఓటీటీ ఆడియెన్స్ రిపోర్ట్’’ వెల్లడించింది. ఈ ఏడాదికి సంబంధించి జులై-సెప్టెంబర్ నివేదిక లేటెస్ట్గా రిలీజ్ అయింది.
Today (22-12-22) Business Headlines: ఆజాద్ ఇంజనీరింగ్ స్పెషల్ యూనిట్: హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ.. జపాన్ సంస్థ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం స్పెషల్ యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. మేడ్చల్‌కి దగ్గరలోని తునికిబొల్లారం ప్రాంతంలో తలపెట్టిన ఈ యూనిట్ నిర్మాణానికి నిన్న బుధవారం భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల రూపాయలు వెచ్చించి అందుబాటులోకి తేనున్న ఈ కేంద్రంలో స్టీమ్ లేదా గ్యాస్ ఎయిర్ ఫాయిల్స్‌ను తయారుచేసి మిత్సుబిషికి సప్లై చేస్తుంది.