Today Business Headlines 17-12-22
తెలంగాణకు 3.. ఏపీకి 15..
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసిన సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. 88 శాతానికి పైగా ఎక్స్‌పోర్ట్స్ కేవలం5 రాష్ట్రాల నుంచే జరగటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య విషయంలో ఏపీ కంటే బీహారే బెటర్ పొజిషన్‌లో ఉందని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్‌ప్రకాశ్ చెప్పారు. 2016-22 మధ్య కాలంలో ఏపీ నుంచి13 వందల స్టార్టప్‌లే నమోదవగా బీహార్ నుంచి 14 వందల 63 స్టార్టప్‌లు నమోదయ్యాయి.
హైదరాబాద్ కంపెనీ ఐపీఓ
ఫైనాన్షియల్ సర్వీసులు అందించే హైదరాబాద్ సంస్థ కెఫిన్ టెక్నాలజీస్.. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు వస్తోంది. సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ ఐపీఓ ద్వారా 15 వందల కోట్ల రూపాయల వరకు ఫండ్స్ పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్ ఫర్ సేల్‌లో భాగంగా 4 కోట్లకు పైగా షేర్లను అమ్మకానికి పెడుతోంది. 40 షేర్లను ఒక లాట్‌గా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఒక్కో లాట్‌కి 14 వేల 640 రూపాయలు అవసరం. రిటైల్ ఇన్వెస్టర్లు మ్యాగ్జిమం 13 లాట్ల వరకు పొందొచ్చని కంపెనీ ఎండీ అండ్ సీఈఓ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు.
మళ్లీ పెరిగిన ఫారెక్స్ రిజర్వ్స్
ఇండియా విదేశీ మారక నిల్వలు వరుసగా ఐదో వారం కూడా పెరిగాయి. ఈ నెల 9వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫారెక్స్ రిజర్వ్‌లు 290 కోట్ల డాలర్లకు పైగా వృద్ధి చెందాయి. తద్వారా మొత్తం 56 వేల 406 కోట్ల డాలర్లకు చేరాయి. తాజా వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారంలో విదేశీ మారక నిల్వలు 11 వందల కోట్ల డాలర్లు గ్రోత్ అయిన సంగతి తెలిసిందే. పోయినేడాది అక్టోబర్‌లో ఫారెక్స్ రిజర్వ్‌లు ఆల్‌టైం రికార్డు స్థాయిలో 64 వేల 500 కోట్ల డాలర్లకు పెరగ్గా ఇప్పుడు కూడా అదే దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.
రూ.5.78 లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నిన్న, మొన్న ఇన్వెస్టర్ల సంపద అనూహ్యంగా ఆవిరైంది. రెండు రోజుల వ్యవధిలోనే 5 పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు హరించుకుపోయాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని లిస్టెడ్ సంస్థల మార్కెట్ మూలధనం 285 లక్షల కోట్లకు తగ్గిపోయింది. ప్రధాన కంపెనీల కన్నా స్మాల్ అండ్ మీడియం లెవల్ స్టాక్స్ పైన అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులతో పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ పడింది.
హైదరాబాద్‌లో ఇబో మార్ట్
హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇకపై ఒకే చోట లభించనుంది. పెయింట్లు, ఎలక్ట్రిక్ వస్తువులు, టైల్స్, కిచెన్ సామాగ్రి.. ఇలా అన్నీ ఆల్ ఇన్ వన్ ప్లేస్‌లో దొరకనున్నాయి. ఎందుకంటే ఇబో మార్ట్‌కు చెందిన ఐబీఓ హోల్‌సేల్ షాపింగ్ మాల్ భాగ్య నగరంలో ప్రారంభమైంది. ఈ సంస్థకు ఇది దేశవ్యాప్తంగా మూడో కేంద్రం. ఈ షోరూంలో 9 సెగ్మెంట్లకు సంబంధించిన 175 బ్రాండ్లు, 8 వేల 500 ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. సిటీలో మరో నాలుగైదు సెంటర్లను లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ రిటైల్ బిజినెస్ సీఈఓ వెంకటేశ్వర్ కుమార్ పేర్కొన్నారు.
లక్ష మందికి ఐటీలో శిక్షణ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సెటిలవ్వాలనుకునేవారికి శుభవార్త. ఐటీ స్కిల్స్‌కు సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేందుకు బైట్‌ఎక్స్‌ఎల్ అనే హైదరాబాద్ స్టార్టప్ ముందుకొచ్చింది. సంస్థను విస్తరించటంలో భాగంగా 90కి పైగా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కలిసి పనిచేయనుంది. తద్వారా 7 రాష్ట్రాల్లోని లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, యాప్స్ డెవలప్‌మెంట్, ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఈ మేరకు హైబ్రిడ్ లెర్నింగ్ మోడ్‌ను ఫాలో కానుంది. టయర్-2, టయర్-3 సిటీల్లో ట్రైనింగ్ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.