Record Level Cars Sales: కొత్తల్లుడికి అత్తింటివారి కానుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Record Level Cars Sales: రోజులు మారాయి. పెళ్లిళ్ల రేంజ్ కూడా పెరిగింది. అత్తింటివారు కొత్తల్లుడికి కట్నం కింద కార్లు ఇస్తున్నారు. ఒకప్పుడు మ్యారేజ్‌కి గిఫ్ట్ రూపంలో ఎక్కువగా లేటెస్ట్ మోడల్ బైక్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ఛేంజ్ అయింది. నూతన వధూవరులకి కాస్ట్‌లీ కానుకలుగా కార్లు బహూకరించేవారి సంఖ్య ప్రతి సంవత్సరంగా భారీగా వృద్ధి చెందుతోంది. దీంతో కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం నవంబర్‌లో కార్ల కొనుగోళ్లలో 26 శాతం గ్రోత్ నెలకొంది.
ఒక వైపు.. ప్రపంచవ్యా్ప్తంగా చిప్ కొరత వేధిస్తోంది. మరో వైపు.. ఆర్థిక మందగమ భయాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాహన రంగంలో కార్లతోపాటు అన్ని విభాగాల్లో సేల్స్ పెరగటం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోయేషన్స్ హర్షం వ్యక్తం చేసింది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చరిత్ర మొత్తమ్మీద ఈ సంవత్సరం నవంబర్‌లో అత్యధిక రిటైల్ అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. అయితే.. దీనికి 2020 మార్చిలో జరిగిన సేల్స్‌ని మినహాయించాలి.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాహనాల్లో భారత్ స్టేజ్ 6 అంటే.. బీఎస్6.. ఇంజన్‌లను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రిటైల్ సేల్స్ పెరిగాయి. ఇదిలాఉండగా.. ఏటా.. సెప్టెంబర్-నవంబర్ మధ్య కాలంలో పండగ సీజన్‌లో కొత్త వెహికిల్ కొంటే మంచిదనే సెంటిమెంట్ ప్రజల్లో్ నెలకొనటం వల్ల కూడా వాహనాల కొనుగోళ్లు దూసుకుపోతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ సంవత్సరం నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్ల సీజన్ అని, ఈ నెల రోజుల్లోనే 30 లక్షలకు పైగా వివాహాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దీంతో టూవీలర్ మరియు ఫోర్ వీలర్ల విక్రయాలు బూస్ట్ అయ్యాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ శ్రుతి సబూ చెప్పారు. ఆర్బీఐ ఇటీవల రెపో రేటు పెంచటం వల్ల వెహికిల్ లోన్ కస్టమర్లపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ మార్కెట్లో కొత్త మోడల్ వెహికిల్స్ లాంఛ్ అవుతుండటంతో అమ్మకాలు తగ్గకపోవచ్చని యాడ్‌కౌంట్ మీడియా అనే మార్కెటింగ్ సంస్థ గ్లోబల్ మొబైల్ బిజినెస్ హెడ్ కుమార్ సౌరవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..