Firing-Hiring: ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు శామ్సంగ్ సంస్థ శుభవార్త చెప్పింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోవటానికి ప్లాన్ చేస్తున్నామని రీసెంట్గా ప్రకటించింది. ఐఐటీల్లో మరియు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో చదివేవాళ్లను రిక్రూట్ చేసుకుంటామని తెలిపింది. కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునేవాళ్లకు బెంగళూరు, నోయిడా మరియు ఢిల్లీల్లోని శామ్సంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లలో వచ్చే సంవత్సరం ప్లేస్మెంట్ ఇస్తామని పేర్కొంది.
Reliance Industries-Naphtha Sale: నాఫ్తా అనేది మండే స్వభావం గల ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమం. సహజ వాయువును ఘనీభవనానికి గురిచేయటం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. పెట్రోలియాన్ని స్వేదనం చెందించటం వల్ల కూడా తయారుచేస్తారు. బొగ్గు తారును మరియు పీట్‌ను కలిపి స్వేదన ప్రక్రియకు లోను చేయటం ద్వారా సైతం నాఫ్తాను సంగ్రహించొచ్చు. వివిధ పరిశ్రమల్లో మరియు ప్రాంతాల్లో నాఫ్తాను ముడి చమురు లేదా కిరోసిన్ వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల మాదిరిగా కూడా వాడతారు.
Tata-Bisleri: మంచి నీళ్ల సీసాకు మారుపేరుగా నిలిచిన బిస్లెరీ కంపెనీ.. అమ్మకానికి వచ్చిందనే టాక్ ఇటీవల వినిపించింది. ఈ మాట ఆ నోటా ఈ నోటా పడి చివరికి సంస్థ అధిపతి రమేష్ చౌహాన్ కి చేరటంతో ఆయన స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఖండించారు. అయితే.. ఇది పెద్ద విషయం కాదు. అసలు.. బిస్లెరీని కొనుగోలు చేసే కంపెనీ ఏది, ఎంత చెల్లించి సొంతం చేసుకోబోతోంది అనేవి హాట్ టాపిక్ అయ్యాయి. టాటా కంపెనీ 7 వేల కోట్ల రూపాయలు పెట్టి బిస్లెరీని కొంటోందనే…
Air india-Vistara: విస్తార ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనం కానుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ రీసెంట్గా ప్రకటించింది. విస్తారలో టాటా గ్రూప్‌కి మెజారిటీ షేరు.. అంటే.. 51 శాతం వాటా ఉండగా మిగతా 49 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది. ఇదిలాఉండగా.. సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాలో 25 పాయింట్ 1 శాతం షేరును దక్కించుకునేందుకు 2 వేల 58 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనుంది.
Indian Smart Watch Market: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మన దేశం మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌వాచ్ మార్కెట్‌గా అవతరించింది. ఇండియన్ స్మార్ట్‌వాచ్ మార్కెట్ ఏకంగా 171 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. ఇది గతేడాదితో పోల్చితే 30 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ వృద్ధికి ముఖ్యంగా బేసిక్ స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్ దోహపడింది.
Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు.
Telangana Best in India: ఈఎస్జీ.. అంటే.. ఎన్విరాన్మెంటల్(పర్యావరణ), సోషల్(సామాజిక) మరియు గవర్నెన్స్(పాలన)పై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) శ్రద్ధ చూపటం పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈఎస్‌జీపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినందుకు హైసియాని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. మనమంతా ఈఎస్‌జీపై సరైన సమయంలోనే దృష్టిపెడుతున్నామని అన్నారు.
International Trade Prospects: అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలకు సంబంధించి.. వరల్డ్‌లోని టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా.. ది బెస్ట్ ఎకనామీ అని ‘‘ఎస్ అండ్ పీ’’ గ్లోబల్ మార్కెట్ ఇంటలిజెన్స్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండదని తెలిపింది. ఈ మేరకు లేటెస్ట్గా గ్లోబల్ ట్రేడ్ మానిటర్ రిపోర్టును విడుదల చేసింది.
World Bank About India: వచ్చే ఏడాది.. ఇండియా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో.. పాపులేషన్‌కి తగ్గట్లే ప్రాథమిక సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు వచ్చే 15 ఏళ్లలో.. ముఖ్యంగా.. నగరాలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలి?, ప్రస్తుతం ఎంత లోటు బడ్జెట్ నెలకొంది? సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల్లో దేని వాటా ఎంత అనే విషయాలను వివరిస్తూ ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదికను విడుదల…
Liverpool Football Club: ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్లలో ఒకరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధిపతి ముఖేష్ అంబానీ ఇప్పటికే మన దేశంలోని క్రీడా రంగంలోకి కూడా ప్రవేశించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్లోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును పదేళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ ‘ఇండియన్ సూపర్ లీగ్’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇప్పుడు విదేశాల్లోని క్రీడా రంగంలో సైతం పెట్టుబడులు పెట్టనున్నారా అనే వార్తలు వెలువడుతున్నాయి.