Today(21-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే నడిచింది. ఇవాళ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. చివరికి భారీ నష్టాల్లో ముగిసింది. జపాన్, చైనా, అమెరికాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందేమో అనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి.
Vodafone Idea is Losing Customers: ‘వన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్’ అంటూ ఆకట్టుకునే ప్రచారంతో దూసుకొచ్చిన టెలికం సంస్థ ఐడియా. ఈ కంపెనీ సిమ్ కార్డ్ తీసుకోవటం వల్ల మన జీవితాలు మారిపోవటం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ సంస్థ జీవితమే తిరోగమనంలో పయనిస్తోంది. వొడాఫోన్-ఐడియాకి ప్రతి నెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు తగ్గిపోతున్నారు. లేటెస్ట్గా అక్టోబర్‌లో 35 లక్షల మంది గుడ్‌బై చెప్పేశారు.
DHFL Loan Fraud Case: అప్పు చేసి పప్పు కూడు అనే మాట మనం విని ఉంటాం. కానీ.. కొంత మంది ఆ తప్పు కూడు తిని ఉన్నారు. DHFL లోన్ ఫ్రాడ్ కేసును దీనికి లేటెస్టు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. DHFL.. అంటే.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ యజమానులు లోన్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకులతో కూడిన కన్సార్షియం నుంచి 42 వేల…
IT Stocks Fallen: అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. దీంతో ఆ ప్రభావం ఇండియన్ టెక్నాలజీ కంపెనీల పైన పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లో ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి. మరీ ముఖ్యంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గతేడాది కన్నా ఈసారి 24 శాతం డౌనైంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఇలా జరగటం ఇదే తొలిసారి. వరుసగా ఐదేళ్లు లాభాలు ఆర్జించిన ఐటీ స్టాక్స్ ఈ సంవత్సరం నష్టాల్లోకి జారుకోవటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది.
India Growth: మన దేశం వచ్చే ఏడాది 5 శాతం గ్రోత్ సాధించినా గొప్ప విషయమేనని, అదే జరిగితే మనం అదృష్టవంతులమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అన్నారు. ఈ ఏడాదితో పోల్చితే వచ్చే సంవత్సరం మరింత కష్టంగా గడవనుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి వేగం మందగించబోతోందని అంచనా వేశారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూపోతున్నాయని, అందుకే గ్రోత్ పడిపోనుందని అభిప్రాయపడ్డారు.
Today(21-12-22) Business Headlines: దావోస్‌కు మంత్రి కేటీఆర్: తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి వెళ్లనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు. ఇండియా నుంచి దాదాపు వంద మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సుకు తెలంగాణ నుంచి ప్రస్తుతానికి కేటీఆర్ పేరు ఒక్కటే తెర మీదికి వచ్చింది.
Today(20-12-22) Stock Market Roundup: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ నిన్న సోమవారం శుభారంభమైనప్పటికీ ఇవాళ మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టింది. లాభం అనేది ఒక్క రోజు ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ రోజు మొత్తం లాస్‌లోనే నడిచింది. సెన్సెక్స్ 103 పాయింట్లు కోల్పోయి 61 వేల 702 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 18 వేల 388 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం 50 స్టాక్స్‌లో 39 స్టాక్స్‌కి నష్టాలు తప్పలేదు.
Vikrant Varshney Exclusive Interview: జీవితంలో విజయం సాధించాలంటే కీలకమైన అంశాలపై దృష్టిపెట్టాలని సక్సీడ్ ఇండోవేషన్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ విక్రాంత్ వర్ష్నీ సూచించారు. ఎన్-బిజినెస్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. దీంతో తమ సక్సీడ్ వెంచర్స్ ఏవిధంగా సక్సెస్ సాధించిందో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. కార్పొరేట్ ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశాను. సొసైటీకి తిరిగివ్వాలనే లక్ష్యంతో బయటికి వచ్చాను.
Today (20-12-22) Business Headlines: ‘ఏపీ బ్యాంక్’కి జరిమానా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంకు.. రూల్స్ పాటించకపోవటంతో ఆర్బీఐ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. మరో 19 కోపరేటివ్ బ్యాంకుల పట్ల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇందులో 17 బ్యాంకులు ఒక్క గుజరాత్‌కే చెందినవి కావటం గమనించాల్సిన విషయం.
ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నెదర్లాండ్స్‌లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన డెల్ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తుంది.