Today (20-01-23) Stock Market Roundup: అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో ఆ ప్రభావం మన దేశ స్టాక్ మార్కెట్‌పైన కూడా పడింది. దీంతో ఈ వారాంతం రెండు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇవాళ శుక్రవారం ఉదయం అతి స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సాయంత్రం కూడా నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి.
రోజంతా అస్థిరంగానే కదలాడాయి. నిలకడలేక.. నష్టాల నడక సాగించాయి. రిలయెన్స్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు వెనకబడటం దెబ్బతీసింది. మొత్తానికి సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి 60 వేల 621 పాయింట్ల వద్ద ఇవాళ్టికి ట్రేడింగ్ ఆపేసింది. నిఫ్టీ 80 పాయింట్లు తగ్గి 18 వేల 27 పాయింట్ల వద్ద ముగిసింది.
read more: DRI notice to Samsung: పన్ను ఎగవేత ఆరోపణల కేసులో
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సున్నా పాయింట్ 7 శాతం డౌన్ అయ్యాయి. నిఫ్టీలో కోలిండియా, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు బాగా రాణించాయి. హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ భారీగా వెనకబడ్డాయి.
సెక్టార్ల వారీగా చూసుకుంటే నిఫ్టీ మీడియా ఇండెక్స్ చెత్త ప్రదర్శన చేసింది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. పీవీఆర్ స్టాక్స్ వ్యాల్యూ 4 శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 184 రూపాయలు పెరిగి అత్యధికంగా 56 వేల 730 రూపాయలు పలికింది. కేజీ వెండి రేటు 459 రూపాయలు లాభపడి గరిష్టంగా 68 వేల 818 రూపాయలుగా నమోదైంది.
క్రూడాయిల్ ధర నామమాత్రంగా నాలుగు రూపాయలు మైనస్ అయింది. బ్యారెల్ చమురు 6 వేల 574 రూపాయల వద్ద ఉంది. రూపాయి వ్యాల్యూ 19 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 22 పైసలుగా స్థిరపడింది.