Gold Imports: బంగారాన్ని తెగ ముద్దు చేసే మన దేశం ఇప్పుడు ‘వద్దు’ అంటోంది. ఫలితంగా పుత్తడి దిగుమతులు మూడో వంతుకు పైగా పడిపోయాయి. డిసెంబరులో ఏకంగా 79 శాతం ఇంపోర్ట్స్ తగ్గిపోయాయి. ఈ విలువైన లోహాన్ని అధికంగా వినియోగించే దేశాల్లో 2వ స్థానంలో ఉన్న ఇండియా ఇలా ఒక్కసారిగా దిగుమతుల్లో భారీ కోత పెట్టడం గ్లోబల్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
read more: UPI Payment Fecility: 10 దేశాల్లోని మనోళ్లకు UPI చెల్లింపుల సౌకర్యం
భారతదేశం బంగారం ఇంపోర్టులను తగ్గించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా లాభాల దూకుడు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. మరో వైపు.. మన దేశ వాణిజ్య లోటు దిగొస్తుందని, రూపాయి బలపడుతుందని చెబుతున్నారు. 2021 డిసెంబర్‌తో పోల్చితే 2022 డిసెంబర్‌లో ఇండియాకి గోల్డ్ దిగుమతులు 79 శాతం తగ్గాయి. ఇది దాదాపు 2 దశాబ్దాల కనిష్టం కావటం గమనించాల్సిన విషయం. పసిడి రేట్లు రికార్డు స్థాయిలో పెరగటంతో డిమాండ్ తీవ్రంగా పడిపోయింది.
2021 డిసెంబర్‌లో మన దేశం 95 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా 2022 డిసెంబర్‌లో 20 టన్నులు మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంది. ఈ లావాదేవీల విలువ సైతం 4 పాయింట్ ఏడు మూడు బిలియన్ డాలర్ల నుంచి 1 పాయింట్ ఒకటీ ఎనిమిది బిలియన్ డాలర్లకు పతనమైంది. 2021 ఏడాది మొత్తమ్మీద వెయ్యీ 68 టన్నుల పుత్తడిని దిగుమతి చేసుకోగా 2022లో టోటల్ గోల్డ్ ఇంపోర్ట్స్ 706 టన్నులకు పడిపోయాయి.