Positive News From Adani Group: అదానీ అంటే అదనే కాదు.. ఇదీనూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Positive News From Adani Group: గడచిన రెండు మూడు వారాలుగా అన్నీ బ్యాడ్ న్యూసే వస్తున్న గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల నుంచి ఇప్పుడు గుడ్ న్యూస్ కూడా వచ్చాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో విశేషంగా రాణించటం ఒక పాజిటివ్ అప్‌డేట్ కాగా.. అదానీ గ్రూపు కంపెనీలు లోన్లకు ప్రీపేమెంట్లు చేస్తుండటం మరో చెప్పుకోదగ్గ అంశం. అదానీ ట్రాన్స్‌మిషన్ సంస్థకు గతేడాది 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి ఏకంగా 78 శాతం లాభం వచ్చింది. రెగ్యులేటరీ ఆర్డర్ వల్ల ఒకేసారి 240 కోట్ల రూపాయల ఆదాయం రావటంతో ప్రాఫిట్స్ జంప్ అయ్యాయని అదానీ ట్రాన్స్‌మిషన్ పేర్కొంది.
విద్యుత్‌కి డిమాండ్ పెరగటంతోపాటు గుజరాత్‌లో కొత్తగా 2 ట్రాన్స్‌మిషన్ లైన్ ప్రాజెక్టులు చేస్తుండటం వల్ల సంస్థ రాబడి 22 శాతం వృద్ధి చెంది 3 వేల 552 కోట్ల రూపాయలకు చేరింది. వన్ టైమ్ ఇన్‌కం 240 కోట్ల రూపాయలను మినహాయిస్తే అదానీ ట్రాన్స్‌మిషన్ నికర లాభం 12 శాతం పడిపోతుందని స్పష్టం చేసింది. ఈ రెండు ట్రాన్స్‌మిషన్ లైన్ ప్రాజెక్టులను అదానీ సంస్థ 35 ఏళ్లపాటు లీజ్‌కి పొందింది. ప్రాజెక్టులు మరియు అసెట్లను కలుపుకుంటే తాము పాన్ ఇండియా సంస్థగా మరింత బలోపేతం అవుతున్నట్లు అదానీ ట్రాన్స్‌మిషన్ వివరించింది.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
read more: Jewellery Prices: ఏప్రిల్ నుంచి ఖరీదు కానున్న ఆభరణాలు
ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా కూడా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నామని తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌లో పవర్‌కి డిమాండ్ పెరిగినప్పటికీ అదానీ ట్రాన్స్‌మిషన్ తనదైన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. విద్యుత్ పంపిణీ నష్టాలను పోయినేడాది ఇదే సమయంతో పోల్చితే దాదాపు ఒక శాతం తగ్గించుకోగలిగింది. విద్యుత్ సగటు లభ్యతను సైతం పెంచింది. 3వ త్రైమాసికంలో బొగ్గు ధర ఒక శాతం, విద్యుత్ కొనుగోలు ధరలు 18 శాతం పెరిగాయని, అయితే వాటి వల్ల తమపై పడ్డ భారంలో కొంత భాగాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేశామని అదానీ ట్రాన్స్‌మిషన్ వివరించింది.
ఇదిలాఉండగా.. అదానీ గ్రూపు.. గతంలో షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న ఒకటీ పాయింట్ ఒక బిలియన్ డాలర్ల రుణాలను ముందస్తుగానే చెల్లిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్లెడ్జ్‌డ్ షేర్లు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూరిటీకి రానుండగా ఏడాదిన్నర ముందే ప్రీపేమెంట్లు చేసి షేర్లను తాకట్టు నుంచి విడిపించుకుంటోంది. ఈ షేర్లు అదానీ గ్రూపులోని అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్ సంస్థలకు సంబంధించినవి.
మార్కెట్‌లో ఇటీవల ఎదురైన ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనఖా షేర్లను ముందస్తుగా విడిపించాలని నిర్ణయించినట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. తాజా చర్యలతో గ్రూపు కంపెనీల పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచాలని అదానీ భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనఖా షేర్లను తగ్గించుకోవటానికి ప్రమోటర్లు కట్టుబడి ఉన్నారని చెప్పటానికి ఇదొక నిదర్శనమని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ప్రీపేమెంట్ వల్ల ప్రమోటర్స్ హోల్డింగ్‌లో ఉన్న 12 శాతం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ షేర్లు రిలీజ్ అవుతాయి.
వీటితోపాటు ప్రమోటర్స్ హోల్డింగ్‌లో ఉన్న 3 శాతం అదానీ గ్రీన్ షేర్లు మరియు 1 పాయింట్ 4 శాతం అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు విడుదలవుతాయి. మొత్తమ్మీద చూస్తే.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ మీద ప్రజల్లో మరియు ఇన్వెస్టర్లలో లేనిపోయి భయాలు నెలకొన్నాయి. ఈ గ్రూపు కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న తమ సంపద ఆవిరైనట్లేనని జనం ఆందోళన చెందారు. అయితే.. అదానీ ట్రాన్స్‌మిషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో మంచి పనితీరు కనబరచటం, అదానీ గ్రూపు కంపెనీలు రుణాలకు ముందస్తు చెల్లింపులు చేయటం ద్వారా డ్యామేజ్ అయిన ఇమేజ్‌ని కాపాడుకోగలిగిందనే ప్రశంసలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..