Royal Enfield Powerful Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ని 2025 నాటికి లాంఛ్ చేయాలని భావిస్తోంది. విద్యుత్ వాహనాల తయారీలో ఇప్పటికే ఎంతో ప్రోగ్రెస్ సాధించామని తెలిపింది. మోటర్ సైకిల్ మార్కెట్‌లోని మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో 93 శాతానికి పైగా వాటా కలిగిన ఈ సంస్థ.. ఈవీ విభాగంలోనూ సత్తా చాటాలని చూస్తోంది. తొలి విడతలో 5 వేల బైక్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
TCS New CEO Krithivasan: టీసీఎస్ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట
ఈ మేరకు ప్రత్యేకంగా ఒక టీమ్‌ని ఏర్పాటుచేసింది. అందులో 65 మందికి పైగా ఉద్యోగులున్నారు. వీళ్లంతా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ టీమ్‌కి.. ఉమేష్ కృష్ణప్ప.. లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ నుంచి 2021లో బయటికొచ్చి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌లో చేరారు. ఈ టీమ్.. ఎల్-ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహనాలను.. ప్రస్తుతానికి ఎల్1సీ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు.
ఎలక్ట్రిక్ బైక్‌లకు సంబంధించి ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఆలోచనలు వివిధ దశల్లో అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ స్టేజ్‌ల్లో ఉన్నాయి. విద్యుత్ వాహనాల తయారీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మిగతా కంపెనీల మాదిరిగా కాకుండా డిఫరెంట్‌గా ముందుకుపోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా.. మార్కెట్‌ని మరియు ట్రెండ్స్‌ని అర్థంచేసుకోవటానికి ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తోంది. ఐరోపాలోని బార్సిలోనాకు చెందిన స్టార్క్ ఫ్యూచర్ అనే స్టార్టప్‌లో వ్యూహాత్మకంగా 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.
దీంతో ఈ రెండు సంస్థలు ఈవీ ప్లాట్‌ఫామ్స్‌ని పరస్పరం షేర్ చేసుకుంటాయి. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి.. సమీప భవిష్యత్తులో.. భిన్నమైన, అద్భుతమైన, సరికొత్త ట్రెండ్ సృష్టించే బైక్‌లు రానున్నాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోవిందరాజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలను ఇలా ఓపెన్‌గా షేర్ చేసుకుంటున్న తొలి సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డే కావటం విశేషం. మిగతా కంపెనీలన్నీ మూడో కంటోడికి తెలియకుండా పనిచేసుకుపోతున్నాయి.