High Court: పంచాయతీ రిజర్వేషన్ల పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ.. ఏం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు విచారించనుంది. బీసీ జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు కేటాయించలేదన్న ఆరోపణలతో పలువురు అభ్యర్థులు కోర్టు ఆశ్రయించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల తిమ్మనోనిపల్లి గ్రామ రిజర్వేషన్లపై ఒక పిటిషన్ దాఖలైంది. గ్రామంలోని అన్ని వార్డులను ఎస్సీ, ఎస్టీ వర్గాలకే కేటాయించారని, కానీ అక్కడ బీసీ జనాభా ఎక్కువగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమని వాదిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయింపులను సవాల్ చేస్తూ మరో పిటిషన్ హైకోర్టు ఎదుట ఉంది. మొత్తం మీద, రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ నడుమ ఈ కేసులు కీలకంగా మారాయి. హైకోర్టు విచారణతో రిజర్వేషన్ విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
READ MORE: I bomma Ravi: నేడు మరోసారి సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీకి ఐ బొమ్మ రవి..
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
మరోవైపు.. తెలంగాణ పల్లెల్లో ప్రజాస్వామ్య ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడంతో రాష్ట్రం మొత్తం ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించింది. జిల్లాల వారీగా ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సిద్ధమవ్వగా, తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్లు గురువారం విడుదల కానున్నాయి. దీనితో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమవుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, సాయం త్రం బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడిన తుది జాబితాను ప్రకటించనున్నారు.
READ MORE: Kajol: సినిమాలు లేకున్నా.. కాజోల్ ఇన్‌కమ్ సీక్రెట్ ఇదే !
తాజావార్తలు
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
-
Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
-
Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!