GST Rate Cut Impact: జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటో కంపెనీల తర్వాత.. తాజాగా FMCG(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించనున్నాయి. దేశంలోని అతిపెద్ద ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్ (HUL), దాని ప్రసిద్ధ ఉత్పత్తులైన డబ్ షాంపూ, లైఫ్‌బాయ్ సోప్, హార్లిక్స్, కాఫీ, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
Talented Artist: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. నటన, పెయింటింగ్, మ్యూజిక్ లో నైపుణ్యం ఉన్న కొందరు సోషల్ మీడియాలో ప్రతిభ చాటుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక కళాకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దానిని చూసి అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా పెయింటింగ్‌లు పెయింటింగ్ కార్డ్బోర్డ్, ఛార్ట్లపై వేస్తారు. కానీ ఈ కళాకారుడు ఒక ఫ్రైయింగ్ పాన్‌పై వేశాడు. రంగులు వాడలేదు. ఓ గుడ్డును ఉపయోగించి…
Odisha School Horror: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ పాఠశాలలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ విద్యార్థుల కళ్ళు మూసుకుపోయాయి. గమనించిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెబాశ్రమ్ పాఠశాల హాస్టల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు.
Anakapalli District: అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య కేసు కలకలం సృష్టిస్తోంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ అంశంపై తాజాగా ప్రత్యక్ష సాక్షి మృతుడు నవీన్ మేనమామ ఎన్టీవీతో మాట్లాడారు. వేకువ జామున తమకు ఓ కాల్ వచ్చిందని..
Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 86 శాతం పూర్తయిందన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రన్ వే, ఎర్త్ వర్క్, ట్యాక్సీ స్టాండ్ 100 శాతం పనులు అయ్యాయని.. టెర్మినల్ 79, ఏటిసి 90, బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68 శాతం పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్ లో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు. విశాఖ…
Nandyal District: ఆస్తికోసం మనుషులు రక్కసులుగా మారుతున్నారు. ఆస్తి వస్తుందంటే.. కన్న తల్లి ప్రాణాన్ని తీసేంత కసాయిలుగా మారిపోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరులో ఇలాంటి ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కర్మ కాండలు పూర్తి కాక ముందే ఆస్తి కోసం కన్న తల్లిని చంపేందుకు కొడుకు, మనవళ్ల యత్నించారు.
Nalgonda: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్పే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు.. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Cable Bridge: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన ఘటన చోటు చేసుకుంది. గతకొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లేక వాహనదారులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయలతో కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితికి చేరుకుంది. ప్రస్తుతం బ్రిడ్జిపై బట్టలు ఆరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జ్ కట్టింది బట్టలు అరేసుకోడానికా అంటూ నెటిజన్ల ఫైర్ అవుతున్నారు.
MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటున్నారు... ఇది లవ్…
Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితితో నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.