Jagtial: జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ కలహాలతో భార్య భర్తలను లేపేసింది. ఈ దిగ్భ్రాంతి కరమైన ఘటన ఇరు కుటుంబాల్లో బాధను మిగిల్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మల్లయ్య అతని భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తాజాగా కుటుంబ కలహాలు, వాగ్వాదంతో భార్య కోపం తీవ్రరూపం దాల్చింది. దీంతో మొదట రోకలి బండతో భర్త తలపై దాడి చేసినట్లు సమాచారం. అతను నేలకూలగానే, మెడపై కత్తితో నరికి చంపినట్లు తెలిసింది. మల్లయ్య తరచూ మద్యం సేవిస్తూ భార్యను వేధించేవాడని, ఇదే కారణంగా భార్య ఈ దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మర్డర్‌తో మల్లాపూర్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.
READ MORE: Samsung Black Friday Sale: ‘శాంసంగ్’ స్మార్ట్ టీవీ కొనండి.. 93 వేల ఉచిత సౌండ్‌బార్ పట్టండి!