T-Series’ Hanuman Chalisa Crosses 5 Billion Views on YouTube: హిందూ పురాణాల ప్రకారం.. ఆంజనేయ స్వామికి ఎంతో విశిష్టత ఉంది. చిరంజీవి అయిన మారుతీ నేటికీ భూమి తిరుగుతున్నాడని చాలా మంది నమ్మకం. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల ఇంట్లో సంతోషం, ఆనందం, సంపద, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఇక హనుమాన్ చాలీసా విశిష్టత గురించి తెలిసిందే. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. అయితే.. తాజాగా హనుమాన్ చాలీసాను కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచం మొత్తం వీక్షించింది.
READ MORE: Riddhi: ప్రభాస్‌తో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా
సంగీత సంస్థ టి-సిరీస్ కి చెందిన ‘శ్రీ హనుమాన్ చాలీసా’ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఏకంగా 500 కోట్లకు పైగా వీక్షణలు పొందింది. ఇప్పటివరకు యూట్యూబ్‌లో 5 బిలియన్లకు పైగా వీక్షణలు పొందిన ఇండియన్ వీడియోగా నిలిచింది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత.. ఈ భక్తి వీడియో అన్ని బాలీవుడ్ ట్రాక్‌లు, పంజాబీ హిట్‌లు, వైరల్ చార్ట్‌బస్టర్‌లను దాటేసింది. మే 10, 2011న విడుదలైన ఈ వీడియోలో దివంగత గుల్షన్ కుమార్ నటించారు. హరిహరన్ గానం, లలిత్ సేన్ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం ఈ వీడియో 5,009,382,302 వీక్షణలతో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోలలో ఒకటిగా నిలిచింది. మరే ఇతర భారతీయ వీడియోలు ఈ రికార్డు దగ్గర్లో కూడా లేవు. హనుమాన్ చాలీసా తరువాతి స్థానంలో పంజాబీ ట్రాక్ లెహెంగా 1.8 బిలియన్ వ్యూస్‌ను కలిగి ఉంది.