I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి.. మరికొద్ది సేపట్లో ఐ బొమ్మ రవిని చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఇమ్మంది రవిపై ఐదు కేసులు నమోదు చేశారు. మొదటి సారీ కస్టడీలో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. రెండవ సారీ మూడు రోజుల పాటు విచారించనున్నారు.
READ MORE: Health Advantages of Anjeer: రోజూ అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..
ఇటీవల రవిపై వరుసగా కేసులు నమోదవుతూ ఉండటం, పీటీ వారెంట్‌ల ఆధారంగా పలు పోలీస్ స్టేషన్ల పోలీసులు కస్టడీ కోరడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఐదు పైగా కేసుల్లో రవి అరెస్టు కాగా, దర్యాప్తు పురోగతి కోసం మరిన్ని వివరాలు వెలికితీయాల్సి ఉందని సీసీఎస్ అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీస్ కస్టడీ పూర్తయ్యాక, రవిని తిరిగి చంచల్గూడా జైలుకు తరలించనున్నారు. ఈ కేసు నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.