Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక […]
Tummala Nageswara Rao: సామజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ భారత దేశం వ్యాప్తంగా పాదయాత్ర చేశారని.. సామాజిక విప్లవం కోసం మ్యానిఫెస్టోలో పెట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటా నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారన్నారు.. సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. సత్తుపల్లి పాత సెంటర్ నుంచి బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
Liquor Shop Applications: నేడు మద్యం దుకాణాల దరఖాస్తులకు చివరి రోజు. నిన్న ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 50 వేల దరఖాస్తులు వచ్చాయి. నేటితో మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు.
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
Telangana Bandh: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.. ఎంజీబీఎస్ నుంచి రోజూ 3500 బస్సుల రాకపోకలు సాగించేవి.. బంద్ నేపథ్యంలో ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి నెలకొంది.. ఎంజీబీఎస్…
Pakistan-Afghan War: పాకిస్థాన్‌కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో సైతం అదే వైఖరిని […]
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. నేడు(శనివారం) బీసీ వర్గాల హక్కుల సాధన కోసం, 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత డిమాండ్‌తో రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అన్ని విద్యాసంస్థలు సెలవును ప్రకటించాయి. మరునాడు అక్టోబర్ 19 ఆదివారం కావడంతో అది వారపు సెలవు. ఆ మరుసటి రోజు, అంటే అక్టోబర్ 20 దీపావళి సెలవు. ఈ విధంగా సండే కలిసిరావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు లభించాయి. పాఠశాలలు, కళాశాలలు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు…
Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.