Chicken Lollipop: చికెన్ లాలీపాప్ అనేది ఇండో-చైనీస్ వంటకాలలో చాలా ప్రసిద్ధమైన స్టార్టర్. భారత్‌లోని దాదాపు ప్రతి చైనీస్ రెస్టారెంట్‌లో ఇది సులభంగా దొరుకుతుంది. చికెన్ వింగ్స్‌లోని మాంసాన్ని ఎముకపైకి నెట్టినట్లుగా మడిచి, ఒక వైపు మాంసం గుండ్రంగా ఉండేలా తయారు చేస్తారు. ఈ ఆకారం లాలీపాప్‌లా కనిపించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీనినే “డ్రమ్స్ ఆఫ్ హెవెన్” అని కూడా అంటారు. ఇండో-చైనీస్ వంటకాలు భారత్‌లోనే పుట్టినవిగా భావిస్తారు. ముఖ్యంగా కోల్‌కతాను ఈ వంటకాలకు పుట్టినిల్లు అంటారు. 1700ల చివర్లో కోల్‌కతాకు వచ్చిన హక్కా చైనీస్ వ్యాపారుల వల్ల ఈ వంటకాల రూపుదిద్దుకుంది. భారతీయ మసాలాలు, చైనీస్ పదార్థాలైన సోయా సాస్ వంటి వల్ల దీని రుచి పెరుగుతుంది. ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. హిందువుల్లో భయాందోళనలు
చికెన్ లాలీపాప్ తయారికి కావలసిన పదార్థాలు:
చికెన్ వింగ్స్ – 500 గ్రాములు
మెరినేషన్‌కు కావలసినవి:
సోయా సాస్ – అవసరమైనంత
గ్రీన్ చిల్లీ సాస్ – అవసరమైనంత
రెడ్ చిల్లీ సాస్ – అవసరమైనంత
ఉప్పు – అవసరమైనంత
ఎంఎస్‌జీ – పావు టీ స్పూన్
నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్
అల్లం – 7 గ్రాములు (పేస్ట్)
వెల్లుల్లి – 14 గ్రాములు (పేస్ట్)
గుడ్డు తెల్లసొన – 1 టేబుల్ స్పూన్
మైదా – 4 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
డీప్ ఫ్రై చేయడానికి నూనె – అవసరమైనంత
సాస్‌కు కావలసినవి:
నూనె – అవసరమైనంత
ఉల్లిపాయలు – 50 గ్రాములు (సన్నగా తరిగినవి)
చికెన్ స్టాక్ – 1 టేబుల్ స్పూన్
కెచప్ – అవసరమైనంత
డార్క్ సోయా సాస్ – అవసరమైనంత
స్ప్రింగ్ ఆనియన్స్ – 2 (తరిగినవి)
తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. ముందుగా చికెన్ వింగ్స్‌ను లాలీపాప్ ఆకారంలోకి తేవాలి. ఒక గుడ్డతో ఎముక దగ్గర భాగాన్ని పట్టుకుని, మాంసాన్ని ఎముక నుంచి విడదీయాలి. కొంచెం బలం ఉపయోగించి మాంసాన్ని మరో చివరకు నెట్టాలి. ఆ తర్వాత విడిపోయిన మాంసాన్ని పట్టుకుని లోపలికి తిప్పితే లాలీపాప్ ఆకారం వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ లాలీపాప్‌లు వేసి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, ఎంఎస్‌జీ, మిరియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మెరినేషన్‌ను కోసం సుమారు 30 నిమిషాలు ఉంచాలి.
వేరే పాత్రలో రెడ్ చిల్లీ సాస్, కెచప్, డార్క్ సోయా సాస్ కలిపి సాస్ సిద్ధం చేసుకోవాలి. ఫ్రై చేసే ముందు మెరినేట్ చేసిన చికెన్‌లో కార్న్ ఫ్లోర్ కలపాలి. డీప్ ఫ్రై పాన్‌లో నూనె వేడి చేసి, చికెన్ లాలీపాప్‌లను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన లాలీపాప్‌లను పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి, తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత చక్కెర, మిరియాల పొడి, సిద్ధం చేసిన సాస్, ఉప్పు వేసి కలపాలి. చివరగా వేయించిన చికెన్ లాలీపాప్‌లను వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించాలి. అంతే.. వేడివేడిగా చికెన్ లాలీపాప్‌ను స్టార్టర్ రెడీ.. ఇది పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో అద్భుతంగా ఉంటుంది.