Samsung Galaxy S26: శాంసంగ్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యూహంలో కీలక మార్పులకు సిద్ధమవుతోందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లలో కొత్త ఏఐ (AI) అసిస్టెంట్‌గా పర్‌ప్లెక్సిటీ (Perplexity)ని తీసుకురావాలనే దిశగా శాంసంగ్ పనిచేస్తోందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం గెలాక్సీ డివైసుల్లో ఉన్న గూగుల్ ఏఐ కోసం ఉపయోగించే హే జమినీ (Hey Gemini) తరహాలో.. కొత్త హాట్‌వర్డ్‌ను శాంసంగ్ పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority), ప్రముఖ టిప్‌స్టర్ అసెంబుల్ డీబగ్ (AssembleDebug) సహకారంతో పర్‌ప్లెక్సిటీ ఆండ్రాయిడ్ (Perplexity Android) యాప్ (వర్షన్ 2.69.3)పై APK టియర్‌డౌన్ నిర్వహించింది. అందులో అభివృద్ధి దశలో ఉన్న హాట్‌వర్డ్ ఫీచర్‌కు సంబంధించిన పలు కోడ్ స్ట్రింగ్స్ బయటపడ్డాయి. వాటి ప్రకారం.. యూజర్లు హే ప్లెక్స్ (Hey Plex) అనే హాట్‌వర్డ్‌తో పర్‌ప్లెక్సిటీ ఏఐ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయగలుగుతారు. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ ఈ AI అసిస్టెంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఇది కూడా Gemini తరహాలోనే పనిచేస్తుంది.
READ MORE: Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
ఈ వేక్ వర్డ్‌ను సెట్ చేసుకోవాలంటే, యూజర్లు తమ వాయిస్ ప్రింట్‌ను రికార్డ్ చేసి ప్రాసెస్ చేయడానికి అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే, ఆడియో రికార్డింగ్ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే హాట్‌వర్డ్‌ను డిలీట్ చేసి మళ్లీ వాయిస్ ప్రింట్ రికార్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని నివేదిక చెబుతోంది. అయితే ఈ ఫీచర్ గెలాక్సీ ఫోన్‌లోని ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్‌లతోనే పనిచేస్తుంది. బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ లేదా బయటి మైక్రోఫోన్‌లు కనెక్ట్ చేసినప్పుడు “Please disconnect” అనే మెసేజ్ కనిపిస్తుంది. నివేదిక ప్రకారం.. పర్‌ప్లెక్సిటీ యాప్‌లో కొత్త సర్వీసులు జోడించారు. వీటిలో శాంసంగ్‌కు చెందిన కొత్తగా యాడ్ చేసిన సర్వీసులు కనిపిస్తున్నాయి. అంతేకాదు, APK టియర్‌డౌన్‌లో రెండు ఇమేజ్ ఫైళ్లు కూడా కనిపించాయి. ఇవి భవిష్యత్ గెలాక్సీ డివైసుల్లో పర్‌ప్లెక్సిటీ ముందే ప్రీ-ఇన్‌స్టాల్ అయి వచ్చే అవకాశాన్ని సూచిస్తున్నాయి. గత సమాచారం ప్రకారం.. ఈ శాంసంగ్– పర్‌ప్లెక్సిటీ భాగస్వామ్యం One UI 8.5 ఫర్మ్‌వేర్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే Galaxy S26 సిరీస్ తో పాటు రానుందని అంచనా.
READ MORE: Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!