Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసలు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డీసీసీ చైతన్య, గన్‌మెన్ సత్యనారాయణ మూర్తిపై మోస్ట్ వాంటెడ్ ఉమర్ కత్తితో దాడి చేసిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న నిందితుడు ఓమర్ పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. బంజారా హిల్స్ అపోలో ఆసుపత్రి నుంచి నిన్న నైట్ డిశ్చార్గ్ డీసీపీ & గన్ మెన్ సత్యనారాయణ…
Moonlighting: ఇటీవల కాలంలో రెండు ఉద్యోగాలు ఒకేసారి చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఓ కంపెనీలో పని చేస్తూ.. మరో కంపెనీలో రహస్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇలా డబుల్ జీతం తీసుకునే వారు ఎక్కువయ్యారు. దీనినే “మూన్‌లైటింగ్” అని అంటారు. సాధారణంగా ఇది కంపెనీ పాలసీలను ఉల్లంఘించడం.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది తీవ్ర నేరం. “మూన్‌లైటింగ్” తాజాగా అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని పెద్ద ప్రమాదంలోకి నెట్టాయి.
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది.
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సు మూసా పేట్ నుంచి 9.30 కి స్టార్ట్ అయ్యింది. ఆరంఘడ్ చౌరస్తా నుంచి రాత్రి 11గంటల తర్వాత బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 30 మంది ప్రయాణికులు బయల్దేరారు. డ్రైవర్, సబ్ డ్రైవర్, క్లీనర్‌తో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 20 మంది…
Sleeper Bus Safety: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వీ.కావేరి ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం చిన్నటకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. మొదట బైక్‌ను ఢీకొన్న బస్సు.. ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం వ్యాపించింది. కొద్దిసేపటికే బస్సు మొత్తం బూడిదైంది. ఈ విషాద సంఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించినట్లు సమాచారం. పలువురి ప్రయాణికులకు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ప్రమాదంలో హృదయవిదారక కథలు వినిపిస్తున్నాయి. తాజాగా తల్లి, కొడుకు ఇద్దరూ సజీవ దహనమైన కేసుల వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నుంచి కావేరి ట్రావెల్ బస్సులో బయలుదేరిన వారిలో బెంగుళూరుకు చెందిన ఫీల్ మన్ బేబీ(64), ఆమె కుమారుడు కిశోర్ కుమార్ (41) ఉన్నారు. వీరు ఇరువురు పటాన్ చెరు…
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి అవకాశం. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఉపసంహరణ మినహా బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మిగతా స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. మొత్తం 81 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, నిన్న ఒక్క అభ్యర్థి కూడా ఉపసంహరణకు…
Bus Accident: కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. "బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు. 20 మంది క్షేమంగా బయటపడ్డారు." అని కలెక్టర్ సిరి తెలిపారు.
Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.