Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో పాటు అక్కడి ఉగ్రవాద హ్యాండ్లర్లకు భారత సైన్యానికి సంబంధించిన సున్నిత సమాచారం పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశ్వసనీయ గూఢచారి సమాచారం మేరకు పంజాబ్ పోలీస్‌లు మాధోపూర్ ప్రాంతంలో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, దేశవిరోధ శక్తులు, ఉగ్రవాద హ్యాండ్లర్లకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్లు బయటపడ్డాయి. ప్రాథమిక దర్యాప్తులో సైన్య స్థావరాలు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వంటి కీలక సమాచారాన్ని అతడు ఉగ్రవాదులతో పాటు పాకిస్థాన్ ఆర్మీ అధికారులకు పంపినట్టు తేలింది. అలాగే సరిహద్దు అవతల ఉన్న డ్రగ్స్ ముఠా నిర్వాహకుడు సాజిద్ భట్టీతో కూడా అతడికి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
READ MORE: Minister Nimmala: జగన్ వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పుబడుతున్నారు: మంత్రి నిమ్మల
ఈ అంశంపై పాఠాన్‌కోట్ ఎస్ఎస్పీ దిల్‌జిందర్ సింగ్ ధిల్లన్ మాట్లాడుతూ.. “ఆ బాలుడి గత ఏడాదికి పైగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద శక్తులతో లింక్స్ ఉన్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలవాడని, ఫోన్ క్లోనింగ్ ద్వారా అతని డివైస్ నుంచి సున్నిత సమాచారం తీసుకున్నారు. ఇలాంటి ఉచ్చులో మరికొందరు పిల్లలు కూడా చిక్కినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బాలుడిని సమయానికి పట్టుకోకపోతే, ఇంకా తీవ్రమైన కార్యకలాపాల్లోకి లాగి దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అలాంటి యువకులను గుర్తించి, వారి రక్షణకు చర్యలు తీసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ బాలుడిపై ఆఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్–1923 కింద కేసు నమోదు చేశారు.” అని వెల్లడించారు.
READ MORE: Sakshi Vaidya: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆఫర్ వచ్చినా.. నేనే తప్పుకున్నా!