Former Union Minister and Congress Leader Suresh Kalmadi Passes Away: ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడి(81) మంగళవారం తెల్లవారుజామున పుణేలో కన్నుమూశారు. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. సురేశ్ కల్మాడి కేంద్రంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగా సేవలందించారు. పుణే నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయన, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నేతగా గుర్తింపు పొందారు. జాతీయ స్థాయిలో క్రీడా పరిపాలనతోనూ దీర్ఘ అనుబంధం ఉంది. కల్మాడి మరణంతో రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కల్మాడికి భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు వివాహిత కుమార్తెలు, మనుమలు ఉన్నారు. సురేశ్ భౌతిక కాయం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు పుణేలోని ఎరండ్వానే ప్రాంతంలోని కల్మాడి హౌస్‌లో ఉంచుతారు. అనంతరం నవి పేథ్‌లోని వైకుంఠ్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
READ MORE: The Raja Saab : మొదలైన ప్రభాస్ ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ రికార్డుల వేట..అప్పుడే 600కే డాలర్లు!
https://www.example.com/india/politics/