Kavitha: గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపునకు గురైన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జాగృతి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత మంత్రి తుమ్మల వల్లే ముంపు ముప్పు ఉందని తెలిపారు. మొక్క రైతులకు బోనస్ చెల్లించి, కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలన్నారు.
Sangareddy: కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చేతికి ఇన్ ఫెక్షన్ తో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణం అంటున్నాడు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన బాధితుడి దయనీయ గాథ ఇది.. సంగమేశ్వర(33) అనే యువకుడు ఈ ఏడాది జూలై 23న రాత్రి 8 గంటలకు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. ఇంజెక్షన్స్, సెలైన్లు పెట్టడంతో తన చేయి ఎర్రగా వాచింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ ని అడిగితే ఐస్ పెట్టుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి…
Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహ్మత్ నగర్ డివిజన్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తు పై ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి అండగా నిలవాలని స్థానిక ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ…
KTR: బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. 2014 నుంచి పదేళ్లలో హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్ పేటలో BRS అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయన్నారు. గంగా జమున తహసీబ్ సంస్కృతి ఉన్న ఇక్కడ ఎప్పుడు మతకల్లోలాలు జరగలేదని.. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా…
Chaadarghat Shooting Case: చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బషీర్‌బాగ్‌లో నిన్న డీసీపీల సమావేశానికి చైతన్య హాజరయ్యారు. సమావేశ అనంతరం తిరిగి సైదాబాద్ లోని తన కార్యాలయానికి బయలుదేరారు. కోఠి దగ్గర ఓ స్నాచింగ్ ముఠా ఓ వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ చోరీ చేస్తున్న విషయాన్ని డీసీపీ డ్రైవర్ గమనించారు. స్నాచింగ్ చేసి ఆటోలో పరార్ అవుతున్న ముగ్గురు నిందితుల గురించి డీసీపీకి చెప్పారు. డీసీపీ ఆదేశంతో ఆటోను వెంబడించారు డీసీపీ డ్రైవర్.. పోలీసులు…
Jubilee Hills by-Election: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిజిస్టర్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది. రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్ రోలర్ గుర్తుల కేటాయించారు. అంబేద్కర్ నేషనల్ పార్టీ అభ్యర్థి చేపూరి రాజుకి రోడ్ రోలర్, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుద్దయ్యకి చపాతీ రోలర్ గుర్తును కేటాయించారు. గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. కారు గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తుల కారణంగా ఓటర్లు…
Pakistan Debt Crisis: దాయాది దేశం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాక్‌లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. జూన్ 2025 నాటికి పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం US$286.832 బిలియన్లకు (సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయలు) పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. తాజాగా…
Delhi official Logo: ఢిల్లీ - పేరుకే దేశ రాజధాని, కానీ ఇప్పటివరకు ఢిల్లీకి ప్రత్యేకంగా చిహ్నం లేదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు తమ ప్రత్యేక గుర్తింపును తెలిపే చిహ్నాలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి గుర్తింపు లేదు. మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం లోగో ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ప్రభుత్వం మొదటి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. నూతన లోగో దేశ రాజధాని చరిత్రలో ఇది ఒక మైలురాయి అవుతుందని అందరూ…
Warangal: వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమవిఫలమవ్వడంతో చెన్నరావుపేట మండలం ధర్మతండాకు చెందిన మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనకు ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదని తేలడంతో మానసికంగా కుంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Karur Stampede: కరూర్‌లో నిర్వహించిన దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. తాజాగా ఈ అంశంపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అక్టోబర్ 27న చెన్నైలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. ఈ తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత ఈ తరుణం చోటు చేసుకోనుంది.