Homemade Pani Puri Recipe in Telugu: పానీ పూరీ భారతదేశం అంతటా చాలా ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ ఫుడ్. ప్రాంతాన్ని బట్టి కొన్ని ఏరియాల్లో దీని పేర్లు మారుతుంటాయి. కొన్ని ప్లేసుల్లో దీనిని గోల్గప్పా, పుచ్కా అని కూడా పిలుస్తారు. క్రిస్పీ పూరీ షెల్స్‌లో ఆలూ–చెనగల మిశ్రమం నింపి, పుదీనా, కొత్తిమీరతో చేసిన పుల్లగా, కారంగా ఉండే పానీ పోసి ఒక్క ముక్కలో తింటే వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్. ఇలాంటి పానీపూరిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు..
1. కొత్తిమీర ఆకులు & కాడలు – 70 గ్రా
2. పుదీనా ఆకులు – 40 గ్రా
3. పచ్చిమిర్చి – 1
4. అల్లం – 2 సెం.మీ ముక్క
5. నిమ్మరసం – 6 టేబుల్ స్పూన్లు
6. చాట్ మసాలా – 2 టేబుల్ స్పూన్లు
7. కాళా నమక్ – 1 టేబుల్ స్పూన్
8. ఆమ్చూర్ పొడి – 2 టేబుల్ స్పూన్లు
9. ఉప్పు – ½ టీస్పూన్
10. చక్కెర – 2 టేబుల్ స్పూన్లు
11. బూంది – 25 గ్రా
12. ఐస్ చల్లని నీరు – 1 లీటర్
ఫిల్లింగ్ కోసం..
1. పెద్ద ఆలుగడ్డలు – 2
2. నల్ల శనగలు (ఉడికించినవి) – 400 గ్రా (డ్రెయిన్ చేసి కడిగినవి)
3. ఎర్ర ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
4. కశ్మీరి మిర్చి పొడి – 2 టీస్పూన్లు
5. చాట్ మసాలా – 2 టీస్పూన్లు
6. చింతపండు చట్నీ – 5 టేబుల్ స్పూన్లు
7. కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు (తరిగినది)
8. పానీ పూరీ షెల్స్ – 30
తయారీ విధానం..
ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం, చాట్ మసాలా, కాళా నమక్, ఆమ్చూర్, ఉప్పు, చక్కెర అన్నీ బ్లెండర్‌లో వేసి 1 లీటర్ ఐస్ చల్లని నీరు పోసి బాగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జల్లెడలో వడకట్టి, చివరగా బూంది కలపాలి. ఫ్రిజ్‌లో ఉంచి చల్లార్చాలి. అనంతరం.. ఫిల్లింగ్ కోసం ఆలుగడ్డలను ఉడికించి, తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగాలి. ఒక బౌల్‌లో ఆలూ ముక్కలు, నల్ల శనగలు, ఉల్లిపాయ, మిర్చి పొడి, చాట్ మసాలా, చింతపండు చట్నీ, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
పానీ పూరీ తయారీ..
పూరీ షెల్ పైభాగంలో చిన్న రంధ్రం చేయాలి. అందులో ఒక స్పూన్ ఫిల్లింగ్ నింపాలి. తినే ముందు పైన పానీ పోసి వెంటనే ఒక్క ముక్కలో తినాలి. రెడీమేడ్ పూరీలు సూపర్ మార్కెట్లలో లేదా ఇండియన్ స్టోర్లలో లభిస్తాయి. బూంది అన్ని ఇండియన్ షాప్స్‌లో సులభంగా దొరుకుతుంది. కశ్మీరి మిర్చి పొడి తక్కువ కారంగా, మంచి రంగు ఇస్తుంది. లేకపోతే మైల్డ్ చిల్లీ పౌడర్ వాడవచ్చు. పానీ ఎప్పుడూ చల్లగా ఉంటే రుచి ఇంకా బాగుంటుంది.