Hyderabad: హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని జాహ్నవి గుప్తాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జాహ్నవి ఇండిగో కెప్టెన్, మరో ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంది. అనంతరం తన గదికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.
India Weather Update: దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఉత్తర భారతదేశంలో చలి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని, కొన్ని చోట్ల తేలికపాటి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా, ఉష్ణోగ్రత తగ్గింది. ఉదయం, సాయంత్రం వేళలో చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, యానాం, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ…
Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో జరిగిన రహస్య సమావేశం ఓ మైనర్ ప్రేమ జంటకు మరపురాని సంఘటటనగా మిగిలిపోయింది. ఎందుకంటే ఈ రహస్య సమావేశాన్ని గ్రామస్థులు చూశారు. దీంతో ప్రేమ జంట కుటుంబాలకు సమాచారం అందించారు. కుటుంబీకుల సమక్షంలో వారి వివాహం జరిపించారు. ఈ మైనర్ జంటకు వివాహం జరిగిన సంఘటనా స్థలంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు సైతం ఉన్నారు. ఆయన వివాహాన్ని ఆపకపోగా.. ఈ నూతన జంటను ఆశీర్వదించారు.
Warangal Anganwadi Child Assault Case: వరంగల్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని, దోషులను కఠినంగా శిక్షించాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆమె స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ఈ ఘటనపై వెంటనే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారు. చిన్నారి ఇంటికి చేరుకుని కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.…
Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
UPSC Aspirant Murder: తిమార్పూర్లోని గాంధీ విహార్ ప్రాంతంలో జరిగిన యూపీఎస్సీ విద్యార్థి రామ్కేష్ మీనా హత్య చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆధారాలను నాశనం చేయడానికి, రామ్కేష్ ప్రియురాలు అమృత చౌహాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్న అమృత తన చదువును ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. హత్యకు ముందు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక క్రైమ్ వెబ్ సిరీస్‌లను సైతం చూసింది. ఎన్ని చేసిన తప్పించుకోలేక పోయింది.
Harish Rao Father Death: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు…
Shocking Murder Case: దేశ రాజధాని ఢిల్లీ తిమార్‌పూర్‌లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
Warangal: వరంగల్‌లో మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఖిలా వరంగల్ తూర్పు కోటలో స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం నిండు ప్రాణాన్ని బలిగొంది. మద్యం సేవిస్తుండగా మాట మాట పెరగడంతో స్నేహితులు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘర్షణలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
Harish Rao father death: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివదేహాన్ని ఉంచారు. ఈ మరణ వార్త వినగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.