Kannada Actor Dhanush Raj: సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తనను కొట్టిందని, వేధింపులకు గురిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించాడు. బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదులో ధనుష్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిందని, ఆ విషయం గురించి ప్రశ్నించగా ఆమె తనపై దాడి చేసిందని పేర్కొన్నాడు. అంతేకాదు, తనను కొట్టేందుకు గూండాలను పంపిస్తానని, అవసరమైతే చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు.
READ MORE: Telangana : తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల నిర్మాతలకు బిగ్ రిలీఫ్
ఎఫ్‌ఐఆర్‌లో మరో ఆరోపణ కూడా ఉంది. అర్షిత కావాలనే బాత్రూమ్‌లోని గాజు పలకకు తన చేతిని కొట్టుకుని గాయపర్చుకుంది. ఆ నేనే ఆమెపై దాడి చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యకు ప్రయత్నిస్తానని బెదిరించిందని ధనుష్ రాజ్ పేర్కొన్నారు. చాలా రోజులుగా నిరంతరం వేధింపులకు గురి చేస్తోందని పేర్కొన్నాడు. తాజాగా బెదిరింపులకు దిగడంతో పోలీసుల సహాయం తీసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదని ధనుష్ రాజ్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఫిర్యాదు అందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
READ MORE: Iphone 17 Price Drop: యాపిల్ ప్రియులకు శుభవార్త.. అతి చౌకగా ఐఫోన్ 17, ఎయిర్ ఐప్యాడ్, మాక్‌బుక్!